విధాత,యాదాద్రి భువనగిరి: ప్రపంచ ఒలింపిక్ డే రన్ సందర్భంగా గురువారం ఉదయం భువనగిరి జూనియర్ కాలేజీ ప్రాంగణం నుంచి ఒలంపిక్ పరుగును నిర్వహించారు.
భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి పోర్ట్, డా.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ ను యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కాగడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు.
కార్యక్రమంలో గడ్డం జ్ఞాన ప్రకాశ్‌రెడ్డి అసిస్టెంట్ గవర్నర్22-23 రోటరీ 3150 జిల్లా, ఒవైసీ ఖాద్రి కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ అసోసియేషన్ భువనగిరి పట్టణ వాకర్స్ నీలం రమేష్, రమేష్ రెడ్డి తదితర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.