Home Latest news ఒకే వేదికపై పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు

ఒకే వేదికపై పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు

విధాత: యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. విశేషం ఏమిటంటే.. ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది కూడా అర్జునే. ఆయన దర్శకత్వం లో తనే నిర్మిస్తున్న చిత్రంతో ఐశ్వర్య తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పరిచయం కానుంది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో.

శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెంబర్ 15గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్, రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిపారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులను చూస్తే ఒక్కసారిగా అవ్వాక్కవ్వాల్సిందే.

ఎందుకంటే, ఈ చిత్ర ఓపెనింగ్‌కి వచ్చే గెస్ట్‌లు ఎవరో.. చివరి వరకు మీడియాకు కూడా తెలియదు. అంత రహస్యంగా ఉంచారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవగా.. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచిన, ఓడిన పోటీదారులు అతిథులుగా హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు హాజరై చిత్రయూనిట్‌కి ఆశీస్సులు అందించారు.

ఇక ముహూర్తపు సన్నివేశానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా.. ప్రకాశ్ రాజ్ స్విచ్ఛాన్ చేశారు. ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్ర్కిప్ట్‌ని చిత్రబృందానికి అందించారు. తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు హాజరైన గెస్ట్‌లను చూసి మీడియా కూడా ఆశ్చర్యపోయిందంటే.. ఈ విషయాన్ని అర్జున్ ఎంత రహస్యంగా డీల్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

‘మా’ ఎన్నికల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఒకేచోట కలవడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకే అంతా ఆశ్చర్యపోయారు. ఈ వేడుకలో ప్రకాశ్ రాజ్‌తో పవన్ కల్యాణ్ కాసేపు ఒంటిరిగా మాట్లాడటం.. మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది.

ఇక అర్జున్ సర్జా సొంత బ్యానర్ అయినటువంటి శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌లో 15వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అంతకుముందు అర్జున్ దర్శకత్వంలో ఈ బ్యానర్‌లో కొన్ని చిత్రాలు వచ్చాయి. అలాగే ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో బిజీగా ఉన్న విశ్వక్‌సేన్‌ను ఈ చిత్రంలో సరికొత్త యాంగిల్ అర్జున్ ప్రజెంట్ చేయనున్నారు.

విశ్వక్ సేన్‌కు ఇది 11వ చిత్రం. అర్జున్ ప్రాణ స్నేహితుడు జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది రోడ్ ట్రిప్ చిత్రం. ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న ఐశ్వర్యకు ముందు ముందు ఎటువంటి అవకాశాలు వరిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నట్లుగా అర్జున్ మీడియాకు తెలిపారు.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...