మైనంపల్లి రాక.. బలపడనున్న కాంగ్రెస్! మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఒకే చేసిన ఏఐసీసీ

- ధృవీకరించిన పిసిసి.. మీడియా చిట్ చాట్‌లో స్వయంగా వెల్లడించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- మైనంపల్లి అభిమానుల్లో నూతన ఉత్తేజం..!
- డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డికి పిసిసి నుంచి పిలుపు..?
- మైనంపల్లి.. తిరుపతి రెడ్డి మద్య సయోధ్య కుదర్చనున్న పిసిసి అధిష్టానం
- తిరుపతి రెడ్డికి ఎమ్మెల్సీ హామీ?
- కాంగ్రెస్ లో వేగంగా మారనున్న రాజకీయ పరిణామాలు
విధాత:మెదక్ జిల్లా ప్రతేక ప్రతినిధి: ఒకవైపు బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకుంటూ నే మరో వైపు పార్టీలో అసమ్మతి సెగలు లేవనెత్త కుండా పిసిసి చర్యలు చేపట్టింది.మైనంపల్లి పార్టీలో చేరక ముందే మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టికెట్ నాదే బరిలో ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో పిసిసి అలెర్ట్ అయ్యింది. మీడియా చిట్ చాట్ సమావేశంలో స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి 2 టికెట్ల ఇస్తున్నట్లు ప్రకటించారు.స్వయంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ రోహిత్ కే దక్క నుందని సమాచారం.
ఇదిలా ఉండగా మెదక్ నుండి టికెట్ ఆశించిన డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డినీ ఢిల్లీకి రమ్మనీ సమాచారం పంపినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి,మ్యాడమ్ బాలకృష్ణ,సుప్రభాత రావ్ తదితరులను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వద్దకు పిలిపించి సయ్యోద్య కుదుర్చ నున్నట్లు తెలుస్తోంది.
నేడు.. కాంగ్రెస్‌లోకి మైనంపల్లి కుటుంబం..
మైనంపల్లి హన్మంతరావు ఆయన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ లు,వారితో పాటు గురువారం బి ఆర్ ఎస్ పార్టీ అసమ్మతి నేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే,సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు.ఈ మేరకు బిఅర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు మైనంపల్లి హన్మంతరావు వెంట ఢిల్లీకి నడుస్తున్నారు.
డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం..!
టికెట్ ఆశించిన డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని పిసిసి నుంచి చెప్పినట్లు సమాచారం. అందుకే తిరుపతి రెడ్డి పక్కా ప్లాన్ తో మండల కమిటీలు,పట్టణ కాంగ్రెస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి తీర్మాన ప్రతులతో తిరుపతి రెడ్డి సహితం ఢిల్లీ వెళుతున్నారు.
కాంగ్రెస్ కు అదనపు బలం కానున్న మైనంపల్లి...
మైనంపల్లి హన్మంతరావు మెదక్ ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా మెదక్,రామాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.మెదక్ ,రామాయంపేట నియోజక వర్గంలో ఆయన అనుచరులు ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ కి అదనపు బలం చేకూర నుంది.సామాజిక సేవా కార్యక్రమాలు ,ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, నిరుపేద కుటుంబాల్లో ఉన్న బాలికలకు ఆర్థిక సాయం వంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు.
ఢిల్లీకి బిఆర్ఎస్ అసమ్మతి నేతలు
మెదక్ నియోజక వర్గం నుంచి బి ఆర్ ఎస్ అసమ్మతి నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్ళారు.ఢిల్లీకి వెళ్లిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ తో పాటు,న్యాయవాది తెలంగాణ ఉద్యమ కారుడు జీవన్ రావు, చిన్న శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి మహేందర్ రెడ్డి,స్వామి నాయక్ తదితరులు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు.
