ఐటీ సోదాల పేరుతో 12 గంటలు నిర్బంధించారని, ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర చేశారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఆరోపించారు

- ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర

- కేసీఆర్.. దమ్ముంటే చెన్నూరులో గెలువు

- చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఐటీ సోదాల పేరుతో 12 గంటలు నిర్బంధించారని, ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర చేశారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఆరోపించారు. కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇళ్లపై మంగళవారం ఏకకాలంలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు కొనసాగించారు. 12 గంటల పాటు ఆయన్ను ప్రచారానికి వెళ్లనివ్వలేదు. ఐటీ దాడుల నేపథ్యంలో వివేక్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూసి ఓర్వలేక కేసీఆర్ కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాక కుటుంబం అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదించలేదని, పూర్తిగా న్యాయబద్ధమైన వ్యాపారం ద్వారానే సంపాదించామని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు కమీషన్ తిన్నారని, మిషన్ భగీరథ స్కీములో పెద్ద స్కామ్ చేసి రూ.40 వేల కోట్లు అప్పనంగా కొట్టేసారని ఆరోపించారు.


బీజేపీ నాయకులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్ అవినీతిపై మాట్లాడడం తప్ప దర్యాప్తు చేపట్టింది ఏమీ లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నాయకులు కలిసి తమ గెలుపును అడ్డుకునే దిశగా ఐటీ దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఐటీ దాడులు ఎన్ని చేయించినా భయపడేది లేదని, న్యాయబద్ధంగా వ్యాపారంలో సంపాదించామని అన్నారు. అక్రమంగా సంపాదించిన వారిపై చేయాల్సిన దాడులను నాపై చేయడం అన్యామని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఐటీ దాడుల పేరుతో తనను ప్రచారానికి పోకుండా 12 గంటల పాటు నిర్బంధించడం ఈ అమూల్య సమయంలో కావాల్సికొని బీజేపీ, బీఆర్ఎస్ కలిసికట్టుగా తనపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసు వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని, అంబులెన్స్ లో తరలించినప్పటికీ ఎవరూ పట్టించుకోరు గాని, న్యాయబద్ధంగా నడుచుకుంటున్న నాపై ఐటీ దాడులు చేయడమేక ప్రచారాన్ని వెళ్లకుండా నిలువరించడమే వీళ్ళ లక్ష్యమన్నారు. నవంబర్ 30న బీఆర్ఎస్ గవర్నమెంట్ కుప్పకూలిపోతుందని, ఆ విషయం కేసీఆర్ కు కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. అధికారం కోల్పోతున్నామని అసహనంతోనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని వివేక్ ఆరోపించారు.

Updated On
Subbu

Subbu

Next Story