విధాత‌(అమరావతి): టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కర్నూల్‌ జిల్లా వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు న‌మోదైంద‌ని, ఆదివారం ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్‌ ఎన్‌440కే వైరస్‌ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై ఫిర్యాదు అందిందని తెలిపారు. న్యాయ‌వాది సుబ్బ‌య్య ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశామన్నారు. ఫిర్యాదును అనుస‌రించి చంద్ర‌బాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్ష‌న్ల కింద అదేవిధంగా 2005 ప్ర‌కృతి వైప‌రీత్యాల చ‌ట్టం […]

విధాత‌(అమరావతి): టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కర్నూల్‌ జిల్లా వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు న‌మోదైంద‌ని, ఆదివారం ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్‌ ఎన్‌440కే వైరస్‌ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై ఫిర్యాదు అందిందని తెలిపారు.

న్యాయ‌వాది సుబ్బ‌య్య ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశామన్నారు. ఫిర్యాదును అనుస‌రించి చంద్ర‌బాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్ష‌న్ల కింద అదేవిధంగా 2005 ప్ర‌కృతి వైప‌రీత్యాల చ‌ట్టం సెక్ష‌న్‌-4 కింద కేసు న‌మోదు చేశామని చెప్పారు.

అయితే ఐదు రోజులక్రితం టీడీపీ ముఖ్య నేత‌ల‌తో ఆన్‌లైన్ ద్వారా స‌మావేశ‌మైన చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఇతర వైరస్‌ల కంటే అత్యంత ప్రమాదకరమైంద‌న్నారు. వైరస్ కొత్త మ్యుటేషన్‌ ఎన్ 440కే ఏపీలో వ్యాపించిందని పేర్కొన్నారు.

Updated On 8 May 2021 10:52 AM GMT
subbareddy

subbareddy

Next Story