Home breaking_news రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రైళ్లకు నిప్పు(Video)

రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రైళ్లకు నిప్పు(Video)

తెలంగాణను తాకిన ‘అగ్నిపథ్’ మంటలు.. 

విధాత: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ మంటలు తెలంగాణను సైతం తాకాయి. బస్సులపై ఎన్ఎస్‌యుఐ కార్యకర్తలు, విద్యార్థులు రాళ్లురువ్వారు.రెండు బోగీలకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మూడు ఫ్లాట్‌ఫాంలను ధ్వంసం చేశారు. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ రణరంగంగా మారింది.

అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్‌ వద్దనున్న బస్టాండ్‌కు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

వెంటనే అక్కడున్న ఆందోళనకారులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరుగులు తీసి అక్కడ నిలిచి ఉన్న రైళ్లపై విద్యార్థులు రాళ్లు రువ్వుతున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎన్ఎస్ యు ఐ కార్యకర్తలు పట్టాల మధ్యలో నిప్పుపెట్టారు. వేలాది మందిగా ఉన్న యువకులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పరిస్థితి పోలీసుల చేయి దాటిపోయింది. రైళ్ల అద్దాలను ధ్వంసం చేస్తుంటడంతో ఏమీ చేయలేక పోలీసులు చూస్తూ ఉండిపోయారు.

పక్కా పథకం ప్రకారం దాడులు.. వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు

మూడు రైళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో రైలులో 6 బోగీలు ధ్వంసమ‌య్యాయి. ప్రయాణికులు.. ఆందోళన కారులు ఎవరో, ప్రయాణికులు ఎవరో తెలియని పరిస్థితి. ఆందోళనకారులు ప్లాట్ ఫార్మ్ లపై ఉన్న స్టాల్స్ ను సైతం ధ్వంసం చేశారు.

సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరం: రేవంత్‌ రెడ్డి

దీంతో రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెంద‌గా, పలువురు యువకులు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు.

ఎన్‌ఎస్‌యూఐకి సంబంధం లేదు: వెంకట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండతో ఎన్‌ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూర్ వెంకట్ స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు.

ఆర్మీ పరీక్ష రద్దు చేసిన కారణంగా 44 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బాధ, ఆవేదనతో పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు ఆ పని చేశారన్నారు. దీన్ని ఎన్‌ఎస్‌యూఐకి ఆపాదించడం సరికాదన్నారు. నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి షాయినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని బలమూర్ వెంకట్ పేర్కొన్నారు.

గందరగోళంగా సికింద్రాబాద్ స్టేషన్‌.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రైళ్ల రాకపోకలు బంద్

సికింద్రాబాద్ ఘటన ఓ కుట్ర..: కిషన్‌రెడ్డి

‘అగ్నిపథ్’ యువతకు సువర్ణావకాశం: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...