Home breaking_news బ్రేకింగ్‌: వెలుగులోకి దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ కుంభ‌కోణం.. సీబీఐ కేసు

బ్రేకింగ్‌: వెలుగులోకి దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ కుంభ‌కోణం.. సీబీఐ కేసు

  • మరో బ్యాంక్‌ స్కామ్‌.. 
  • ₹34,615 కోట్ల మోసం కేసులో డీహెచ్ఎఫ్ఎల్ పై సీబీఐ కేసు!

విధాత‌: బ్యాంకులను వేల కోట్లు మోసం చేసి పారిపోయిన నీరవ్ మోడీని మించిన మరో కేసు తాజాగా వెలుగు చూసింది. అదే ‘దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ (డీహెచ్ఎఫ్ఎల్)కు చెందిన రూ.34,615 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణం. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం ఇదేనని పరిశీలకులు అంటున్నారు.

ఈ కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ సహా పలువురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ తో సంబంధమున్న మహారాష్ట్రలోని 12 ప్రదేశాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

50 మంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారని సమాచారం. సోదాల అనంతరం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌తో పాటు, కపిల్‌, దీరజ్‌ వాధ్వాన్‌తో పాటు అమరిల్లీస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో.. ఇదే అతిపెద్ద మోసంగా నిలిచింది. ఇప్పటివరకు ఏబీజీ షిప్‌యార్డ్స్‌ కంపెనీ (రూ.22,842 కోట్లు) చేసిన మోసమే అతి పెద్దది. బ్యాంకు కన్షార్షియం 2010 నుంచి 2018 మధ్య రూ.42,871 కోట్ల మేర రుణాలు సమకూర్చినట్లు యూనియన్‌ బ్యాంక్‌ తెలిపింది. 2019 నుంచి తిరిగి చెల్లింపులు నిలిచిపోయినట్లు సీబీఐకి 2021లో ఆ బ్యాంక్‌ లేఖ రాసింది.

తాము కేపీఎంజీ అనే ఆడిట్‌ సంస్థతో ఆడిట్‌ నిర్వహించినప్పుడు వివిధ అంశాలు వెలుగులోకి వచ్చినట్లు యూనియన్‌ బ్యాంక్‌ పేర్కొంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిబంధనల ఉల్లంఘనతో పాటు ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడినట్లు గుర్తించామని యూనియన్‌ బ్యాంక్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 11న సీబీఐకి ఫిర్యాదు చేసింది.

దీనిపై సీబీఐ తాజాగా తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసింది. మరోవైపు యెస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో ఇప్పటికే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ ప్రమోటర్లు ఇద్దరూ జైల్లో ఉన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను గతేడాది పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఈఎల్‌) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

17 బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసే కుట్ర..

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,615 కోట్ల మేర మోసం చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు వారిపై ఉన్నాయి. ఆయా బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు రూ.42,871 కోట్ల రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది.

పెద్దఎత్తున నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలను డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల్లో తప్పుగా చూపించి, దురుద్దేశపూర్వకంగా వాటిని తిరిగి చెల్లించలేమంటూ చేతులు ఎత్తేశారని సీబీఐ పేర్కొంది. ప్రధానంగా 2019 మే నెల నుంచి లోన్లను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్ఎఫ్ఎల్ ఆపేసింది.

ఫలితంగా బ్యాంకులు ఆయా లోన్లను మొండి బకాయిలుగా ప్రకటించాయని తెలిపింది. ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ మోసపూరిత చర్యల వల్ల బ్యాంకులకు దాదాపు రూ.34,615 కోట్లు నష్టం జరిగిందని వివరించింది.

నిందితులుగా..

ఈ కేసులో నిందితులుగా కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లతో పాటు స్కైలార్క్ బిల్డ్ కాన్ కంపెనీ, దర్శన్ డెవలపర్స్, సిగ్తియా కన్ స్ట్రక్షన్స్ బిల్డర్స్, టౌన్ షిప్ డెవలపర్స్, శిషిర్ రియల్టీ, సన్ బ్లింక్ రియల్ ఎస్టేట్, సుధాకర్ షెట్టి తదితరులను నిందితులుగా చేర్చింది. వీరందరిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోని పలు సెక్షన్ల తో పాటు చీటింగ్అభియోగాలతో కేసులు నమోదు చేశారు.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...