HomeLatest newsఉక్రెయిన్‌ షాపింగ్‌ మాల్‌పై క్షిపణితో రష్యా దాడి

ఉక్రెయిన్‌ షాపింగ్‌ మాల్‌పై క్షిపణితో రష్యా దాడి

  • భారీగా ఎగసిపడుతున్న‌ మంటలు
  • ఇద్దరు మృతి, 20 మందికి పైగా గాయాలు

విధాత‌: ఉక్రెయిన్‌ షాపింగ్‌ మాల్‌పై సోమవారం క్షిపణితో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా 20 మందికిపైగా గాయపడ్డారు. తూర్పు ఉక్రెయిన్‌ నగరమైన క్రెమెన్‌చుక్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

క్షిపణి దాడితో షాపింగ్‌ మాల్‌లో భారీగా మంటలు ఎగసిపడినట్లు అక్క‌డి పత్రికా వార్తా సంస్థ‌లు వెల్ల‌డించాయి. దాడి సమయంలో షాపింగ్‌ మాల్‌లో చాలామంది ఉన్నట్లుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించినట్లు ప‌త్రిక‌లు పేర్కొన్నాయి.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!