ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌జీపీటీతో టెక్నాలజీరంగంలో సంచలనం సృష్టించిన ఓపెన్‌ ఏఐ కంపెనీ నుంచి సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌ లో చేరారు.

Sam Altman | ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌జీపీటీతో టెక్నాలజీరంగంలో సంచలనం సృష్టించిన ఓపెన్‌ ఏఐ కంపెనీ నుంచి సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఆయనను మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో చేరారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఆయనతో ఓపెన్‌ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ సైతం మైక్రోసాఫ్ట్‌లో చేరినట్లో సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే, ఓపెన్‌ఐతో భాగస్వామ్యానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

శామ్‌ ఆల్ట్‌మన్‌, గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ ఏఐ బృందానికి నేతృత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరి నియామకంపై సత్య నాదెళ్ల స్పందిస్తూ.. మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన.. దాని ఉత్పత్తి రోడ్‌ మ్యాప్‌పై ఉన్నకం ఉందన్నారు. ఓపెన్‌ఏఐ కొత్త సీఈవో, ఎమ్మెట్‌ షియర్‌ కొత్త నాయకత్వంతో కలిసి పని చేయడంపై కంపెనీ ఉత్సాహంగా ఉందని తెలిపారు. ఆల్ట్‌మన్‌, బ్రాక్‌మాన్‌ మైక్రోసాఫ్ట్‌లో వారి సహోద్యోగులతో చేరబోతున్నారని, అక్కడ కొత్త అధునాతన ఏఐ బృందానికి నాయకత్వం వహిస్తారని ప్రకటిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. ఇందు కోసం అవసరమైన వనరులను అందిస్తారన్నారు.


ఇదిలా ఉండగా.. ఆల్‌మన్‌కు ఉద్వాసన, గ్రెగ్‌ రాజీనామా నేపథ్యంలో ఓపెన్‌ఏఐలో రాజీనామాలు కొనసాగుతున్నాయి. స్టార్టప్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ పరిశోధకులు రాజీనామా చేశారు. దాంతో పాటు మరికొందరు కంపెనీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఓపెన్‌ఏఐ రీసెర్చ్ డైరెక్టర్ జాకుబ్ పచోకీ, ఏఐ రిస్క్ అసెస్‌మెంట్ హెడ్ అలెగ్జాండర్ మాడ్రీ, దీర్ఘకాల పరిశోధకుడు స్జిమోన్ సిడోర్ రాజీనామా చేశారు. అయితే, మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ఓపెన్‌ఏఐలో భారీ ప్టెబడులు పెట్టింది. కంపెనీకి చెందిన బింగ్‌తో పాటు పలు ఉత్పత్తుల్లో ఏఐ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్‌ వినియోగిస్తున్నది.

Updated On 21 Nov 2023 7:53 AM GMT
TAAZ

TAAZ

Next Story