సాధార‌ణంగా క్రికెట్‌లో ఇండియా- పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ అంటే ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే అంద‌రు టీవీల‌కి అలా అతుక్కొని కూర్చుంటారు. అయితే ప్ర‌స్తుతం జ‌ర‌గుతున్న‌ అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ కప్‌లో భార‌త్ -పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ చూడాల‌నుకున్న వారి క‌ల చెదిరింది. అండర్‌-19 ప్రపంచకప్ లో బెనోని వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ పోరులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి ఫైన‌ల్‌కి చేరుకుంది. దీంతో ఆదివారం జరగబోయే అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గనుంది.

ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో కేవలం 179 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా మరో 5 బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యాన్ని సాధించింది. అయితే ల‌క్ష్య చేధ‌న‌లో ఆసీస్ 9 కోల్పోవ‌డం విశేషం. పాకిస్తాన్ ఆ ఒక్క వికెట్ ద‌క్కించుకోలేక టోర్నీ నుండి వైదొలిగింది. ఎట్ట‌కేల‌కి ఆస్ట్రేలియా ఫైన‌ల్‌కి చేర‌డంతో భార‌త్‌- ఆసీస్ మ‌ధ్య ఫిబ్రవరి 11 ఆదివారం సహారా పార్క్ విల్లోమూర్ క్రికెట్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2018 తర్వాత కంగారూ టీమ్‌కి టోర్నీ ఫైనల్‌ టిక్కెట్‌ లభించగా, ఈ సారి స‌త్తా చాటుతారా లేదా చూడాల్సి ఉంది.

వ‌ర‌ల్డ్ క‌ప్.. పాక్‌ని చిత్తు చేసి ఫైన‌ల్‌కి వెళ్లిన ఆస్ట్రేలియా..భార‌త్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్ ఎప్పుడంటే..!ఇక ఈ ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫినాలేకి చేరింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన భార‌త్ అన్నింటా విజ‌యం సాధించింది. ఆరు మ్యాచ్‌ల‌కి గాను ఆరు మ్యాచ్‌లు భార‌త్ గెల‌వండంతో టీమిండియా ఆత్మ‌విశ్వాసంతో ఫినాలే ఆడ‌బోతుంది. గ‌తంలో అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో రెండుసార్లు తలపడగా, రెండు సార్లు భార‌త్ గెలిచింది. మ‌రి ఈ సారి కూడా భార‌త్ ఆస్ట్రేలియాని ఓడించి టోర్నీ ద‌క్కించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క భార‌తీయుడు కోరుకుంటున్నారు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన సీనియ‌ర్స్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో కూడా భార‌త్ టోర్నీ మొత్తం ఒక్క‌టి కూడా ఓడిపోకుండా ఫినాలే చేరింది. కాని ఫైన‌ల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడి భంగ‌ప‌డింది.

sn

sn

Next Story