ICC ODI World Cup 2023: మరికొద్ది రోజులలో వన్డే వరల్డ్ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి భారత జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుందా అని కొద్ది రోజులుగా జోరుగా నడుస్తుంది. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది. జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, […]

ICC ODI World Cup 2023: మరికొద్ది రోజులలో వన్డే వరల్డ్ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి భారత జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుందా అని కొద్ది రోజులుగా జోరుగా నడుస్తుంది. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది. జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించారు. తిలక్ వర్మకి మొండి చేయి చూపించారు. కొన్నాళ్లుగా తిలక్ వర్మకి చోటు దక్కుతుందని ప్రచారం సాగగా, అది పుకారుగానే మిగిలింది.
ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలను వన్డే వరల్డ్ కప్‌కి పక్కన పెట్టడం గమనర్హం బ్యాకప్ గా ఉన్న సంజూ సామ్సన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. యుజువేంద్ర చహల్ ను వన్డే వరల్డ్ కప్ కోసం పట్టించుకోలేదు. ఈ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ కెప్టెన్ గా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉండనున్నారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ వరల్డ్ కప్‌లో ఆడనున్నారు. ఇషాన్ కిషన్ మరో వికెట్ కీపర్ గా ఉండనున్నాడు. వన్డే ఫార్మాట్ లో పెద్దగా రాణించని సూర్యకుమార్ యాదవ్ పై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచారడం విశేషం.
ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఐసీసీ సెప్టెంబర్ 28 వరకు అవకాశం ఇచ్చింది. ఆ లోపులో పలు మార్పులు చేసుకోవచ్చు. ప్రస్తుతం 15 మందితో కూడిన భారత జట్టు చూస్తే.. అందులో
బ్యాటర్లు : రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్
వికెట్ కీపర్లు : ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్
ఆల్ రౌండర్లు : హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్
బౌలర్లు : మొహమ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ (స్పిన్నర్)ఉన్నారు.
టీమిండియా ప్రపంచకప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్
