వరుస షాట్లు కొడుతూ.. దొరికిపోయిన రోహిత్‌ శర్మ

కీలక సమయంలో ఆవేశపూరిత షాట్లు ఆడి వికెట్‌ పోగొట్టుకున్నాడంటూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో మాజీ సీనియర్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. రోహిత్‌ శర్మ టోర్నమెంట్ మొదటి నుంచీ అగ్రెసివ్‌ ఆట తీరు ప్రదర్శిస్తూ వచ్చాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా అదే దూకుడుమీద ఉన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ అవుటయి తర్వాత భారత రన్‌రేటును పెంచే క్రమంలో షాట్లకు పూనుకున్నాడు.


గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓవర్‌లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ కొట్టిన రోహిత్‌.. మరో బంతిని కూడా అలానే బౌండరీ దాటించే ప్రయత్నంలో ట్రావిస్‌కు దొరికిపోయాడు. దీనిపై సెహవాగ్‌ స్పందిస్తూ.. అప్పటికే ఒక సిక్స్‌, ఫోర్‌ కొట్టిన తర్వాత మళ్లీ భారీ షాటుకు ప్రయత్నించాల్సిన అవసరం లేదని కోచింగ్‌ స్టాఫ్‌ ఆయనకు చెప్పాలని పేర్కొన్నాడు. ఇది నిస్సందేహంగా బ్యాడ్‌ షాట్‌ అని స్పష్టం చేశాడు. రోహిత్‌ కొనసాగి ఉంటే.. పరిస్థితి ఇంకోలా ఉండేదని అన్నాడు.

Updated On
TAAZ

TAAZ

Next Story