టైటిల్ ఫేవ‌రేట్‌గా భార‌త్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 టోర్నీలో బరిలోకి దిగ‌గా, మొద‌టి మ్యాచ్ నుండి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ఫైన‌ల్ వ‌ర‌కు చేరింది. అయితే టైటిల్ మ్యాచ్‌లో మాత్రం అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ తేలిపోవ‌డంతో క‌ప్ ఆస్ట్ట్రేలియా వ‌శం అయింది. అయితే భార‌త్ అప‌జ‌యానికి ప్ర‌ధాన కార‌ణాలుగా వీటిని చెబుతున్నారు. ముందుగా పేల‌వ‌మైన ఫీల్డింగ్. లో స్కోరింగ్ గేమ్‌లో భార‌త ఫీల్డ‌ర్స్ స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. రనౌట్ అయ్యే పలు అవకాశాలను మిస్ చేశారు. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే ఫైన‌ల్‌లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ నిరాశపరిచారు.

బ్యాటింగ్ కూడా పూర్తిగా నిరాశ‌ప‌ర‌చింది. బ్యాట్స్‌మెన్స్ చాలా అజాగ్రత్త షాట్లు ఆడుతూ తమ వికెట్లను వదులుకున్నారు. ఇక భారత బౌలర్లు 18 అదనపు పరుగులు ఇవ్వ‌గా, ఇందులో 7 బైలు, 11 వైడ్‌లు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇండియా ఓట‌మికి ఆ అంపైర్‌ని కూడా ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ఇంగ్లీష్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. అయితే గత పదేళ్లలో టీమిండియా ఓడిన కీలకమైన మ్యాచ్ లలో ఈ కెటిల్‌బరోనే అంపైర్ గా ఉండ‌గా, భార‌త్ అన్నింట ఓట‌మి పాలైంది. ఇక ఈ సారి ఫైన‌ల్‌కి కూడా అత‌నే అంపైర్ అనే స‌రికి అంద‌రిలో టెన్ష‌న్ మొద‌లైంది. ఏమైన అద్భుతం చేస్తారా, సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా అని అంద‌రు ఆశ‌గా ఎదురు చూడ‌గా, చివ‌ర‌కు ఆ అంపైర్ మ‌రోసారి భార‌త్‌కి ఐరెన్ లెగ్ అని నిరూపించాడు.

2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో కెటిల్‌బరోనే అంపైర్ చేయ‌గా, ఆ మ్యాచ్‌ల‌న్నీ కూడా ఇండియా ఓడిపోయింది. ఇక ఇప్పుడు జ‌రిగిన ఇండియా- ఆస్ట్రేలియా ఫైన‌ల్‌లో కూడా భార‌త్ కప్ చేజార్చుకుంది. దీంతో భార‌త్ అభిమానులు రిచర్డ్ కెటిల్‌బరోని నాకౌట్ మ్యాచ్‌ల‌కి అంపైర్‌గా పెట్టొద్దు అని వేడుకుంటున్నారు.

Updated On 20 Nov 2023 3:17 AM GMT
sn

sn

Next Story