విధాత: నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరు శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు.
మొక్కులు చెల్లించుకున్న అనంతరం వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విఘ్నేశ్ దంపతుల ఫొటో షూట్ నిర్వహించారు.
నయనతారను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. కొందరు అభిమానులు ఈ జంటతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో వారిని అక్కడి నుంచి నయనతార బాడీగార్డ్స్ పంపేశారు.
ఫొటో షూట్ జరుగుతున్నంత సేపు ఆలయం దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫొటో షూట్ జరుగుతున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. నయనతార జంటకు రక్షణగా వచ్చి భద్రతా సిబ్బంది కారు ఎక్కించారు.