- చరిత్రలో తొలిసారి.. ఒక్క నెలలోనే..
విధాత : కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా.. రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం సైతం రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఒక్క మే నెలలో రికార్డు స్థాయిలో రూ.130 కోట్లు ఆదాయం వచ్చినట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఒక్క నెలలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం టీటీడీ చరిత్రలో మొదటిసారి అన్నారు.
మే నెలలో 22.62 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత మూడు నెలలుగా వంద కోట్లకు పైగానే హుండీ ఆదాయం వస్తోంది. అయితే గత వారం రోజుల నుంచి ఈ భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. గంటల తరబడి క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నా.. భక్తులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తిరుమల శ్రీవారి సన్నిధికి క్యూ కడుతున్నారు. టైమ్ స్లాట్ సర్వదర్శన విధానం పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని. టైమ్ స్లాట్ టోకెన్ కేంద్రాలు ఏర్పాటు చేప్తామని. త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లను భక్తులకు జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.