- సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా నష్టం
విధాత: దేశీయ మార్కెట్లు ఈ వారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పలు అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో సరికొత్త గరిష్ఠస్థాయి 8.6 శాతానికి మే నెలలో చేరిన నేపథ్యంలో, వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని మదుపర్లు వేచి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 16 వేల దిగువకు చేరింది. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 1,447 పాయింట్లు నష్టపోయి 52,835 వద్ద.. నిఫ్టీ 420 పాయింట్లు క్షీణించి 15,781 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹78.20గా ఉంది. సన్ ఫార్మా షేర్లు తప్ప బీఎస్ సెన్సెక్స్ 30లోని అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.