Buffalo | ఈ దున్న ధ‌ర కోట్ల రూపాయాల్లోనే. ఈ మేలు ర‌కం దున్న‌పోతు ధ‌ర అక్ష‌రాలా రూ. 25 కోట్లు. ఈ దున్న ధ‌ర‌ను ప‌క్క‌న పెడితే.. దీని వీర్యానికి కూడా మంచి గిరాకీ ఉంది. మొత్తంగా ఈ దున్న వీర్యాన్ని విక్ర‌యించి నెల‌కు రూ. 9.60 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు రైతు. మ‌రి ఈ దున్న గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానా వెళ్ల‌క త‌ప్ప‌దు. వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ర్యానా( Haryana )లోని పానీప‌ట్ జిల్లా దిడ్వాడి గ్రామానికి […]

Buffalo | ఈ దున్న ధ‌ర కోట్ల రూపాయాల్లోనే. ఈ మేలు ర‌కం దున్న‌పోతు ధ‌ర అక్ష‌రాలా రూ. 25 కోట్లు. ఈ దున్న ధ‌ర‌ను ప‌క్క‌న పెడితే.. దీని వీర్యానికి కూడా మంచి గిరాకీ ఉంది. మొత్తంగా ఈ దున్న వీర్యాన్ని విక్ర‌యించి నెల‌కు రూ. 9.60 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు రైతు. మ‌రి ఈ దున్న గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానా వెళ్ల‌క త‌ప్ప‌దు.

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ర్యానా( Haryana )లోని పానీప‌ట్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన న‌రేంద్ర సింగ్ అనే రైతు ఓ మేలుర‌కం దున్న‌పోతును పెంచుకుంటున్నారు. దీని ముద్దు పేరు షెహ‌న్‌షా( Shahenshah ). దీని వ‌య‌సు ప‌దేండ్లు కాగా, పొడ‌వు 15 అడుగులు, ఎత్తు ఆరడుగులు. అయితే దున్న వీర్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ప్ర‌తి నెల‌లో నాలుగు సార్లు దున్న వీర్యాన్ని బ‌య‌ట‌కు తీస్తారు. ఆ వీర్యంతో దాదాపు 800 డోసుల‌ను త‌యారు చేస్తారు. ఈ డోసుల త‌యారీకి రూ. 300 చొప్పున ఖ‌ర్చు అవుతుంది. అనంత‌రం వీర్యాన్ని మార్కెట్‌లో విక్ర‌యించి నెల‌కు రూ. 9.60 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు న‌రేంద్ర సింగ్.

ఈ దున్న కోసం న‌రేంద్ర సింగ్ ప్ర‌త్యేకంగా ఓ ఈత కొల‌ను నిర్మించారు. షెహ‌న్‌షా అనేక పోటీల్లోనూ విజేత‌గా నిలిచింది. ఓ చాంపియ‌న్‌షిప్‌లో ఏకంగా రూ. 30 ల‌క్ష‌లు గెలుచుకుంది. ఈ దున్న‌ల‌కు క‌ర్నాల్ న‌గ‌రం ప్ర‌సిద్ధి. స్థానికంగా ఈ దున్న‌ల‌ను న‌ల్ల బంగారం అని పిలుస్తారు.

Updated On 22 April 2023 6:40 AM GMT
subbareddy

subbareddy

Next Story