సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన ఇస్రో బాహుబలి
ఇస్రో బాహుబలి ఉపగ్రహ వాహక నౌకగా పేర్కొనే ఎల్‌వీఎం3.. సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాల ఖాతాలో మరోటి చేరింది. కమ్యూనికేషన్ రంగంలో కీలకమైన సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెటర్ నుంచి ఆదివారం సాయంత్రం దీనిని విజయవంతంగా ప్రయోగించారు. సరిగ్గా 24 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే ఎల్‌వీఎం3-5 రాకెట్ సరిగ్గా ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ గగన వీధుల్లోకి దూసుకుపోయింది. ఇస్రోకు చెందిన హెవీ వెయిట్ లాంచ్ వెహికల్ అయిన సియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్వీ) LVM3 అంతరిక్షంలోకి 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకుని పోగల శక్తి కలిగినది. తాజా ప్రయోగానికి ఇదే వాహనాన్ని ఇస్రో ఉపయోగించింది.
కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 బరువు 4,410 కిలోలు. భారత గడ్డ మీద నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం. ఈ ఉపగ్రహ వాహక నౌకను ఇస్రో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసింది. కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 బరువు 4,410 కిలోలు. భారత గడ్డ మీద నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం. ఈ ఉపగ్రహ వాహక నౌక ఎల్‌వీఎం3ని ఇస్రో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ రాకెట్ 43.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఎల్‌వీఎం3ని ఇస్రో ఉపయోగించడం ఇది ఐదోసారి.
ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ డాక్టర్ వీ నారాయణన్ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన C25 క్రయజెనిక్ స్టేజ్‌ను గతనతలంలో విజయవంతంగా పరీక్షించామన్నారు. ఇది ఇస్రో ప్రయాణంలో మరో మైలురాయి వంటిదని పేర్కొన్నారు. ‘LVM3-M5 విజయవంతంగా కక్ష్యలోకి కచ్చితత్వంతో వెళ్లింది. ఎల్‌వీఎం3 ద్వారా ఇది వరుసగా 8వ విజయవంతమైన ప్రయోగం. సీఎంఎస్–03 అనేది జీటీవో ఆర్బిట్‌లోకి చేర్చిన అత్యంత బరువైన ఉపగ్రహం. వాహన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి.. పదిశాతం అధిక పేలోడ్‌ను తీసుకుపోయేలా అభివృద్ధి చేశాం’ అని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్లపాటు సేవలు అందించనున్నదని తెలిపారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇది పనిచేస్తుందని చెప్పారు. వాతావరణ పరంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మిషన్‌ను విజయవంతం చేశామన్నారు. భారత నావికాదళ కార్యాచరణ అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా దీనిని రూపొందించినట్టు తెలిపారు.గతంలో భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో.. ఫ్రెంచ్‌గుయానాలోని కౌరౌ లాంచ్‌బేస్‌ను ఉపయోగించేది. 2018 డిసెంబర్‌లో సుమారు 5,854 కిలోల బరువున్న జీశాట్–11ను విజయవంతంగా ఇక్కడి నుంచే ప్రయోగించింది. ఇస్రో ఇప్పటి వరకూ నిర్మించిన అతి భారీ ఉపగ్రహం ఇదే.
ఇస్రో తదుపరి మిషన్.. డిసెంబర్ రెండో వారంలో షెడ్యూల్ చేశారు. ఎల్‌వీఎం3–ఎం6.. కస్టమర్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. ఈ ఉపగ్రహం తయారీ పనులు శ్రీహరి కోటలో ముమ్మరంగా సాగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram