• నల్గొండలో గ్యాస్ పంపిణీకి అత్యాధునిక సిటీ గేట్ స్టేషన్ ను ప్రారంభించిన మేఘా • జిల్లాలో ఇంటింటి కి గ్యాస్ పంపిణీకి రంగం సిద్ధం • పది CNG స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన మేఘా • నలబై వేల గృహాలకు మేఘా గ్యాస్ హైదరాబాద్: ఒక వైపు ఆకాశానికి అంటిన LPG సిలిండర్ ధరలు.. మరో వైపు పెరుగుతున్న పెట్రోల్ రేట్లతో మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి […]

• నల్గొండలో గ్యాస్ పంపిణీకి అత్యాధునిక సిటీ గేట్ స్టేషన్ ను ప్రారంభించిన మేఘా
• జిల్లాలో ఇంటింటి కి గ్యాస్ పంపిణీకి రంగం సిద్ధం
• పది CNG స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన మేఘా
• నలబై వేల గృహాలకు మేఘా గ్యాస్

హైదరాబాద్: ఒక వైపు ఆకాశానికి అంటిన LPG సిలిండర్ ధరలు.. మరో వైపు పెరుగుతున్న పెట్రోల్ రేట్లతో మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి మధ్యతరగతి ప్రజలకు మేఘా సంస్థ ఊరటనిస్తోంది. తెలంగాణా లోని నల్గొండ జిల్లాలో తొలి సారిగా మేఘా గ్యాస్ పేరుతో తన సేవలను ప్రారంభించి మరో మైలురాయిని సాధించింది.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యం తో తీసుకువచ్చిన CGD (City Gas Distribution) ప్రాజెక్ట్ లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ తెలంగాణా లోని నల్గొండ జిల్లాలో గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు 'మేఘా గ్యాస్' కింద గ్యాస్ సరఫరా సేవలను ప్రారంభించి చౌక ధరలకు అందించడం వినియోగదారులకు తీపివార్త.
CGD - నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ.
మేఘా ఇంజనీరింగ్, నల్గొండ ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ ని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొని నల్గొండ జిల్లాలోని సిటీ గేట్ స్టేషన్ ద్వారా PNG ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా CNG (compressed Natural Gas) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 km స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 km పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40,000 కుటుంబాలకు & పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో ఇంకా 500 km పొడవు గల MDPE పైప్ లైన్ నిర్మాణము చేపడుతోంది. అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట మరియు కోదాడ లలో 10 CNG స్టేషన్లు నిర్మిస్తున్నారు. సిజిడి ప్రాజెక్ట్లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జి స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సిఎన్జి)ని అందిస్తోంది. మేఘా గ్యాస్ ఇట్స్ ‘స్మార్ట్-ఇట్స్ గుడ్’ పేరుతో గ్యాస్ను సరఫరా చేస్తోంది

Updated On 12 April 2021 4:21 AM GMT
subbareddy

subbareddy

Next Story