రాజధాని హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి.నగరంలోని హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, బోరబండ, రహమత్‌నగర్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లిలో ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉన్నది.ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో మున్సిపల్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా […]

రాజధాని హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి.నగరంలోని హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, బోరబండ, రహమత్‌నగర్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లిలో ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉన్నది.ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో మున్సిపల్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా మున్సిపల్‌ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.తెల్లవారుజాము నుంచి వాన కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.నేడు అక్కడక్కడ భారీ వర్షాలు వాతా‌వ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా రాష్ట్రం‌లోని పలు ప్రాంతాల్లో ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లు‌లతో కూడిన వర్షాలు కురు‌స్తు‌న్నాయి. ఒడిశా పరి‌సర ప్రాంతాల్లో ఉన్న ఉప‌రి‌తల ఆవ‌ర్తనం మంగ‌ళ‌వారం బల‌హీ‌న‌ప‌డింది. మరా‌ఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక వరకు గాలి విచ్ఛి‌న్నతి ఏర్పడింది.దీని ప్రభా‌వంతో మంగ‌ళ‌వారం సంగా‌రెడ్డి, కామా‌రెడ్డి, వికా‌రా‌బాద్‌, సిద్ది‌పేట, నిర్మల్‌, ఆది‌లా‌బాద్‌, రంగా‌రెడ్డి, సూర్యా‌పేట జిల్లా‌ల్లోని పలు‌ప్రాం‌తాల్లో వర్షం కురి‌సింది.17 జిల్లాల్లో తేలి‌క‌పాటి వర్షం కురి‌సి‌నట్టు టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ వెల్లడిం‌చింది. సోమ‌వారం మొద‌లైన ఈ వానలు రెండ్రో‌జులు కురిసే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నది.

Updated On 14 April 2021 4:59 AM GMT
subbareddy

subbareddy

Next Story