విధాత‌(హైదరాబాద్‌): కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ టీకా సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు ఎంత మోతాదులు సరఫరా చేయాలో వివరిస్తూ సంబంధిత సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల వారీగా జాబితాను కేంద్రం పంపింది. రెమ్​డెసివిర్​ ఔషధ సంస్థలతో చర్చించిన అనంతరం కేంద్రం తన నిర్ణయం వెలువరించింది. ఈ నెల 16 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. జైడస్‌ క్యాడిలా 9,82,100 వయల్స్‌, హెటిరోకు 17,17,050, మైలాన్‌కు 7,28,000, […]

విధాత‌(హైదరాబాద్‌): కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ టీకా సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు ఎంత మోతాదులు సరఫరా చేయాలో వివరిస్తూ సంబంధిత సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల వారీగా జాబితాను కేంద్రం పంపింది.

రెమ్​డెసివిర్​ ఔషధ సంస్థలతో చర్చించిన అనంతరం కేంద్రం తన నిర్ణయం వెలువరించింది. ఈ నెల 16 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. జైడస్‌ క్యాడిలా 9,82,100 వయల్స్‌, హెటిరోకు 17,17,050, మైలాన్‌కు 7,28,000, సిప్లాకు 7,32,300, షిన్జిన్‌/సన్‌ 3,73,000, జుబిలియంట్‌ 4,45,700, డాక్టర్‌ రెడ్డీస్‌ 3,21,850 కేటాయించింది. తెలంగాణకు 1.45లక్షల డోసులు కేటాయించింది. ఇందులో హెటిరో 86,300 వయల్స్‌, మైలాన్‌ 45వేలు, షిన్జిన్‌/సన్‌ 2వేలు, జుబిలియంట్‌ 500, డాక్టర్‌ రెడ్డీస్‌ 11,200 వయల్స్‌ సరఫరా చేయనున్నాయి.

Updated On 8 May 2021 9:26 AM GMT
subbareddy

subbareddy

Next Story