తెలంగాణ ఎన్నికలలో 119 స్థానాలకు గాను 360 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 226 మందికి నేర చరిత్ర ఉంది

విధాత : తెలంగాణ ఎన్నికలలో 119 స్థానాలకు గాను 360 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 226 మందికి నేర చరిత్ర ఉంది. అందులో బీఆరెస్ పార్టీ 119మంది అభ్యర్థుల్లో 58మంది, బీజేపీ 111మంది అభ్యర్థుల్లో 78మంది, కాంగ్రెస్ 118మంది అభ్యర్థుల్లో 84మంది, ఎంఐఎం 12మంది అభ్యర్థుల్లో 6గురు నేర చరితులున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, ఇతర పార్టీలు, స్వతంత్రులు మొత్తం 2,290మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 48మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా బాన్సువాడ, నారాయణ పేటలలో ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు.

Updated On
Somu

Somu

Next Story