✕
టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం తట్టుకోలేని ఓ క్రికెట్ అభిమాని బాధతో గుండెపోటుకు గురై మృతి చెందాడు.

x
విధాత : టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం తట్టుకోలేని ఓ క్రికెట్ అభిమాని బాధతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. తిరుపతి మండలం దుర్గసముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ ఓటమి అనంతరం, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ చలించిపోయాడు.
అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌లో తమ అభిమాన జట్టు ఓడిపోవడంతో క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Somu
Next Story