✕
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు బోయినపల్లి అభిషేక్ బెయిల్, అరెస్టు పిటీషన్లను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

x
విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు బోయినపల్లి అభిషేక్ బెయిల్, అరెస్టు పిటీషన్లను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. తన అరెస్టును సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కన్నా, జస్టిస్ ఎస్ఎస్వి కట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ కేసులో ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అభిషేక్‌కు లిక్కర్ కుంభకోణంలో ఇండో స్పిరిట్ నుంచి 3.85 కోట్ల రూపాయల ముదుపు ముట్టినట్లు సాక్షాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకుచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం అభిషేక్ బోయినపల్లి లేవనెత్తిన అంశాలపై 5 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని అదేశిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 4 వాయిదా వేసింది.

Somu
Next Story