విధాత : నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐకేపీ కేంద్రాల పర్యటన ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. బీజేపీ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పలుచోట్ల ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఆందోళన కారులను అదుపు చేయడంతో బండి సంజయ్ తన పర్యటనను కొనసాగించారు. నల్గొండ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో బండి సంజయ్ రాకకు ముందే స్థానిక టీఆర్ఎస్ […]

విధాత : నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐకేపీ కేంద్రాల పర్యటన ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. బీజేపీ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పలుచోట్ల ఉద్రిక్తత తలెత్తింది.

పోలీసులు ఆందోళన కారులను అదుపు చేయడంతో బండి సంజయ్ తన పర్యటనను కొనసాగించారు. నల్గొండ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో బండి సంజయ్ రాకకు ముందే స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొనుగోలు వివరాలను ఎమ్మెల్యే ఆరా తీశారు.

బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు హోరెత్తించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ బండి సంజయ్ ఐకేపీ కేంద్రంలో రైతులతో మాట్లాడారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు నేతృత్వంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తల నడుమ ఘర్షణ జరగకుండా చెదరగొట్టారు.

పలు చోట్ల మార్గ మధ్యంలో బండి సంజయ్ కాన్వాయ్ పై కోడి గుడ్లు, రాళ్లు విసిరారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రాళ్ల దాడిలో బీజేపీ కాన్వాయ్ లో ఒక కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ప్రతి గింజను కొంటామని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం మాట మార్చారని బండి సంజయ్ విమర్శించారు. పండిన ప్రతి గింజను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల పై రాళ్లు, కోడి గుడ్లు వేస్తారా అని నిలదీశారు.

Updated On 15 Nov 2021 1:33 PM GMT
subbareddy

subbareddy

Next Story