విధాత : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ మెట్రో చాట్ విత్ మధు యాష్కీ గౌడ్ పేరుతో మెట్రో స్టేషన్లలలో, రైలులో వినూత్న ప్రచారం చేపట్టారు. మంగళవారం ఆయన గాంధీభవన్ నుంచి తను పోటీ చేస్తున్న ఎల్బీనగర్ వరకు ప్రయాణించి ప్రయాణికులతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంపై ముచ్చటించారు. మధు యాష్కీ గౌడ్ మెట్రో రైలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారాన్ని మునుముందు మరింత మంది అభ్యర్థులు అనుసరించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

Updated On
Subbu

Subbu

Next Story