విధాత‌(హైద‌రాబాద్‌): కరోనా బారిన ప‌డి హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి తెలంగాణ పోలీసులు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. ‘సేవా ఆహార్‌’ పేరిట ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీసత్యసాయి సేవా సంస్థలు, లీడ్‌లైఫ్‌ ఫౌండేషన్‌, స్విగ్గి, బిగ్‌బాస్కెట్‌, హోప్‌ ఆర్గనైజేషన్ల సంయుక్త సహకారంతో ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ రెండువేల మంది వరకు భోజనాలు అందించనున్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో మహిళా భద్రత విభాగం అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఉచిత ఆహారం […]

విధాత‌(హైద‌రాబాద్‌): కరోనా బారిన ప‌డి హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి తెలంగాణ పోలీసులు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. ‘సేవా ఆహార్‌’ పేరిట ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీసత్యసాయి సేవా సంస్థలు, లీడ్‌లైఫ్‌ ఫౌండేషన్‌, స్విగ్గి, బిగ్‌బాస్కెట్‌, హోప్‌ ఆర్గనైజేషన్ల సంయుక్త సహకారంతో ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ప్రారంభించారు.

ప్రతిరోజూ రెండువేల మంది వరకు భోజనాలు అందించనున్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో మహిళా భద్రత విభాగం అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఉచిత ఆహారం సదుపాయ సేవలను ప్రారంభించారు. ఐసొలేషన్‌లో ఉన్నవారు ఆహారం కావాలంటే.. ఉదయం 6 గంటలకు ముందే 7799616163 నంబర్‌కు వాట్సప్‌ మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. ముందుగా బాధితుడి పేరు, ఫోన్‌నంబర్‌, లొకేషన్‌, పాజిటివ్‌ వివరాలు పంపాలి.

ఉదయం 6 తర్వాత మెసేజ్‌ పెడితే మరుసటిరోజు భోజనాన్ని షెడ్యూల్ చేస్తారు. ఒక మెసేజ్‌లో ఐదుగురికి మధ్యాహ్న భోజనం రిక్వెస్ట్‌ పెట్టవచ్చు. ఒక ఫోన్‌నంబర్‌ నుంచి ఐదుసార్లు మాత్రమే భోజనం కోసం రిక్వెస్ట్‌ పెట్టొచ్చు. వాట్సప్‌ద్వారా మాత్రమే ఆహారం కోసం రిక్వెస్ట్‌లు తీసుకోవడం జరుగుతోంది. వారం రోజుల్లో ‘సేవా ఆహార్‌’ పేరిట యాప్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Updated On 7 May 2021 5:38 AM GMT
subbareddy

subbareddy

Next Story