విధాత‌,హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న విద్యార్థులనే డిగ్రీ, ఇంజనీరింగ్‌ తరగతులకు అనుమతించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఇతర కాలేజీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం యూనివర్సిటీల అధికారులతో ఉన్నత విద్యా మండలి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యంగా హస్టళ్ల నిర్వహణ, […]

విధాత‌,హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న విద్యార్థులనే డిగ్రీ, ఇంజనీరింగ్‌ తరగతులకు అనుమతించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఇతర కాలేజీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం యూనివర్సిటీల అధికారులతో ఉన్నత విద్యా మండలి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యంగా హస్టళ్ల నిర్వహణ, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ మేరకు ప్రస్తుతం వ్యాక్సిన్లు ఉచితంగా అందుబాటులో ఉన్నందున, విద్యార్థులందరూ తప్పనిసరిగా వేయించుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు.

Updated On 28 Aug 2021 6:32 AM GMT
subbareddy

subbareddy

Next Story