మ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును భుజానికి ఎత్తుకున్న మాజీ ఎంపీ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావులు అలుపెరుగని ప్రచారం సాగిస్తున్నారు

విధాత : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును భుజానికి ఎత్తుకున్న మాజీ ఎంపీ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావులు అలుపెరుగని ప్రచారం సాగిస్తున్నారు. ఒకవైపు తాము పోటీ చేస్తున్న పాలేరు, ఖమ్మంలలో తమ ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ వ్యవహారాలు చూసుకుంటునే ఇంకోవైపు మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం వారు శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం చర్ల, దుమ్ముగూడెంలలో పొంగులేటి, తుమ్మలు రోడ్ షో ప్రచారాలతో సందడి చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం వారు నిర్వహించిన ప్రచారంలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మంత్రి పువ్వాడ అజయ్ తో సహా ఒక్క బీఆరెస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనివ్వనన్న పొంగులేటి అదే పట్టుదలతో జిల్లాలో తుమ్మలతో కలిసి కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు ముందుకు దూకిస్తున్నారు.

Updated On
Somu

Somu

Next Story