విధాత: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అన్నమే మేయిన్ కోర్స్ గా తీసుకుంటారు. మనలో కొంత మందికైతే ఏం తిన్నా అన్నం తిన్నట్టు ఉండదు. ఎందుకంటే అన్నంతో ఏరకమైనా వెజ్, నాన్ వెజ్, సైడ్ డిష్ అయినా సరే చక్కగా కలిసి పోయి రుచి గా ఉండడం మాత్రమే కాదు. కడుపు నిండుగా తృప్తిగా ఉంటుంది. అంతేకాదు అన్నం వండేందుకు వాడే బియ్యం కూడా చాలా రకాలు అందుబాటులో దొరుకుతాయి. వైట్ రైస్ మంచివేనా.. ఈ మధ్య […]

విధాత: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అన్నమే మేయిన్ కోర్స్ గా తీసుకుంటారు. మనలో కొంత మందికైతే ఏం తిన్నా అన్నం తిన్నట్టు ఉండదు. ఎందుకంటే అన్నంతో ఏరకమైనా వెజ్, నాన్ వెజ్, సైడ్ డిష్ అయినా సరే చక్కగా కలిసి పోయి రుచి గా ఉండడం మాత్రమే కాదు. కడుపు నిండుగా తృప్తిగా ఉంటుంది. అంతేకాదు అన్నం వండేందుకు వాడే బియ్యం కూడా చాలా రకాలు అందుబాటులో దొరుకుతాయి.
వైట్ రైస్ మంచివేనా..
ఈ మధ్య తెల్లని అన్నం(వైట్ రైస్) వైపు అందరూ కొంచెం భయంగా చూస్తున్నారు. మరి తెల్లని ఈ అన్నం తినడం మంచిదేనా? కాదా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ లో ఈజీగా దొరికేది తెల్ల బియ్యమే. వడ్ల గింజల మీద ఉండే ఊకతో పాటు దాని కింద ఉండే హస్క్, బ్రాన్ లేయర్లు మర పట్టి తొలగించేస్తే మిగిలే గింజలే ఈ తెల్లని బియ్యం. అయితే ఈ తెల్లని బియ్యం తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని, వీటిలో కేవలం కెలోరీలు మినహా మరే పోషకం లేదనే మాటా ఈ మద్య బాగా వినిపిస్తోంది. అందువల్ల మనలో చాలా మందికి ఈ తెల్లని బియ్యం విషయంలో చాలా రకాల అనుమానాలు మొదడును తొలిచేస్తున్నాయి.
తెల్లని అన్నంతోనూ లాభాలు..
లారెన్ మనేకర్ అనే నిపుణుడు తెల్ల అన్నం తినడంలో ఉండే మంచీచెడులను గురించి వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. తెల్లని అన్నం నుంచి కూడా కొద్దిపాటి మంచి ఫైబర్, ఇతర పోషకాలు లభిస్తాయి. పొట్టు మొత్తం తీసేసినా సరే బ్రౌన్ రైస్ తో పోల్చినపుడు సగం ఫైబర్ ఉంటుంది.
వంద గ్రాముల తెల్లని అన్నంలో సుమారు ఒక గ్రాము ఫైబర్ ఉంటుంది. అంతేకాదు విటమిన్స్, జింక్, సెలేనియం, నియాసిన్, ఫోలేట్, ఫాస్ఫరస్, విటమిన్ బి6 కూడా కొద్ది మొత్తంలో ఉంటాయి. తెల్ల అన్నంలో కార్బోహైడ్రేట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. శరీరం శక్తిని సంతరించుకోవడానికి కావల్సిన ఇంధనం వంటి పోషకం కార్బోహైడ్రేట్లే.
అన్నం తింటేనే మాంగనీస్..
ఫోలేట్ మినహా మిగతా అన్ని బీ కాంప్లెక్స్ విటమిన్లు కూడా అన్నం నుంచి లభిస్తాయి. కణ స్థాయిలో శక్తి ఉత్పత్తికి బీకాంప్లెక్స్ విటమిన్లు తోడ్పడుతాయని ఇప్పటి వరకు జరిపిన అన్ని అధ్యయనాలు తెలియ జేస్తున్నాయి. అందుకే శరీరంలో శక్తి ఉత్పత్తికి విటమిన్ బి చాలా అవసరం. విటమిన్ బికాంప్లెక్స్ తగ్గితే శరీరానికి కావల్సినంత శక్తి అందడం లేదని అర్థం. కాల్షియం, విటమిన్ Dతో పాటుగా ఎముకలకు బలాన్ని అందించే మరో మినరల్ మాంగనీస్. ఇది అన్నం ద్వారానే అందుతుంది.
అన్నం తినడం వల్ల కలిగే లాభాల గురించి చర్చించాము కానీ కొంత నష్టం కూడా ఉంది. అందులో ముఖ్యమైంది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం. డయాబెటిక్స్ ఈ తెల్లని అన్నం తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.
భ్రౌన్ రైస్‌తో డయాబెటీస్ డౌన్
వారానికి ఐదు సర్వింగ్ లకు మించి తెల్లని అన్నం తినే వారికి డయాబెటిస్ రిస్క పెరుగుతుందని ఆర్చివ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ లో ఒక పెద్ద అధ్యయన ఫలితాలలో ప్రచురించారు. ఈ అద్యయననానికి 39 వేల మంది పురుషులు 1 లక్షా 57 వేల మంది స్త్రీలను ఎంచుకున్నారు. వీరంతా తెల్లని అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తిన్నపుడు రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గినట్టుగా చెప్పారు.
అతిగా తింటేనే..
తెల్ల అన్నం క్రమం తప్పకుండా, మితిమీరి తింటే మెటబాలిక్ సిండ్రోమ్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ వంటి లైఫ్ స్టైల్ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు నడుము చుట్టు కొవ్వు పెరుగుతుంది, బీపీ లో మార్పులు రావచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పరిమితి మించితే..
నిపుణులు ఇచ్చే సలహా ఏమిటంటే తెల్లని అన్నాన్ని చూసి అంత భయపడాల్సిన పనిలేదు. అలాగని అస్తమానం అన్నమే తింటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పరిమితుల్లో తెల్లని అన్నాన్ని మీకు నచ్చిన సైడ్ డిష్ తో లాగించడంలో పెద్ద నష్టం లేదు.
