మావోయిస్టులకి వ్యతిరేకంగా "ఆదివాసీ సంఘాల" పేరుతో కరపత్రాలు.మావోయిస్టులు బందుకి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా "ఆదివాసీ సంఘాల" పేరుతో చర్ల మండలంలోని పెద్ద మిడిసిలేరు, ఆర్. కొత్తగూడెం, దోసినపల్లి, కుందూరు, దుమ్ముగూడెం మండలాల్లో కరపత్రాలు విడుదలయ్యాయి. మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం చెపట్టి అభివృద్ధి పనులని అడ్డుకుంటున్నారని, అదే విధంగా అభివృద్ధి పనులు నిర్వహించే కాంట్రాక్టర్లను బెధిరిస్తూ వారి నుంచి 10 నుంచి 15శాతం పర్సంటేజులు దోచుకుంటున్నారని కరపత్రంలో ఆరోపించారు. వారి డిమాండ్లను నిరాకరించిన కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లను […]

మావోయిస్టులకి వ్యతిరేకంగా "ఆదివాసీ సంఘాల" పేరుతో కరపత్రాలు.మావోయిస్టులు బందుకి పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా "ఆదివాసీ సంఘాల" పేరుతో చర్ల మండలంలోని పెద్ద మిడిసిలేరు, ఆర్. కొత్తగూడెం, దోసినపల్లి, కుందూరు, దుమ్ముగూడెం మండలాల్లో కరపత్రాలు విడుదలయ్యాయి. మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం చెపట్టి అభివృద్ధి పనులని అడ్డుకుంటున్నారని, అదే విధంగా అభివృద్ధి పనులు నిర్వహించే కాంట్రాక్టర్లను బెధిరిస్తూ వారి నుంచి 10 నుంచి 15శాతం పర్సంటేజులు దోచుకుంటున్నారని కరపత్రంలో ఆరోపించారు. వారి డిమాండ్లను నిరాకరించిన కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లను చంపేస్తున్నారని, వేసిన రోడ్లని మందుపాతర పెట్టి పేల్చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా మావోయిస్టులు ఎక్కువ శాతం భర్తలను కోల్పోయిన మహిళలను టార్గెట్ చేసి వారి పిల్లలను బలవంతంగా తీసుకెళ్లి తమ పార్టీలో చేర్చుకుని వారిని ఎన్నో హింసలు పెడుతున్నారన్నారు.

Updated On 26 April 2021 4:13 AM GMT
subbareddy

subbareddy

Next Story