మంత్రి కేటీఆర్ పై సీఈఓ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ టీ హబ్ లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని, కేటీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కోంది. కోడ్ అతిక్రమించిన కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో కట్టడి చేయాలని కాంగ్రెస్ నేత అజయ్ సీఈవోకు ఫిర్యాదు చేశారు.

  • మరో వివాదంలో కేసు నమోదు

విధాత: మంత్రి కేటీఆర్ పై సీఈఓ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ టీ హబ్ లో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని, కేటీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కోంది. కోడ్ అతిక్రమించిన కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో కట్టడి చేయాలని కాంగ్రెస్ నేత అజయ్ సీఈవోకు ఫిర్యాదు చేశారు.

అలాగే మంత్రి కేటీఆర్‌, కవి గాయకుడు గోరంటి వెంకన్నలు అమరవీరుల స్మారక స్థూప ప్రాంగణంలో ఇచ్చిన ఇంటర్య్వూపై కూడా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్వ్యూ నిర్వాహకుడి పైకి కూడా కేసు నమోదు చేశారు. ఇంటర్వ్యూలో కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం కనపడేలా షూటింగ్ చేశారని, డ్రోన్‌తో షూటింగ్ చేశారని, ఎన్నికల కోడ్ వేళా అందుకు ఎలా అనుమతించారని కాంగ్రెస్ నేత నిరంజన్ ప్రశ్నించారు. దీనిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది

Updated On 21 Nov 2023 9:00 AM GMT
Somu

Somu

Next Story