విధాత‌: గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ […]

విధాత‌: గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని హెచ్చరించింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఆదివారం భారీ వర్షాలు పడతాయని వివరించింది.

ఈ నెల 6 వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులున్నాయని, అది వాయుగుండంగా మారొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated On 6 Sep 2021 3:55 AM GMT
subbareddy

subbareddy

Next Story