విధాత: యూనివర్సల్ హీరోగా పేరున్న కమల్ హాసన్‌కు గతంలో మరో పేరు కూడా ఉండేది. సీరియల్ కిస్సర్ అని. బాలీవుడ్లో ఇమ్రాన్ హష్మికి ‘సీరియల్ కిస్సర్’ అని ఎలా పేరుందో.. దక్షిణాదిలో ఆ పేరుకు కమల్ హాసన్ అంత ఫేమస్. తన సినిమాలలో నటించిన ఏ హీరోయిన్ పెదాలని కొరకకుండా కమల్ హాసన్ వదిలిపెట్టలేదంటే.. ముద్దు ఆయనికి ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి ఈ ట్రెండ్ హాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు చేరడానికి కూడా కాస్త టైమ్ పట్టింది కానీ.. అంతకు ముందే కమల్ హాసన్ కిస్సుల ట్రెండ్‌ని క్రియేట్ చేశాడంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆఫ్కోర్స్.. ఇప్పుడది కామన్ అయిపోయిందనుకోండి. అదే వేరే విషయం.
ఇక విషయంలోకి వస్తే.. అప్పుడు హీరోయిన్లతో ముద్దులు సునామీ సృష్టించిన కమల్ హాసన్.. ఇప్పుడు ‘విక్రమ్’ విజయోత్సాహంలో మగాళ్లపై మోజు పెంచేసుకుంటున్నారు. సారీ.. తప్పుగా అర్థం చేసుకోకండి.. విశ్వనటుడి అభిమానులు కూడా ఫైర్ కాకండి. ‘విక్రమ్’ ఇచ్చిన సక్సెస్ కిక్‌తో.. ఆ టీమ్‌కు వరుసబెట్టి ముద్దులు పెట్టారు కమల్ హాసన్. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ముద్దు పెదాలపై కాదులెండి.. చెంప పైనే. ఇప్పటికే ‘విక్రమ్’ దర్శకుడికి కారు, ఆ సినిమాలో రోలెక్స్‌గా నటించిన సూర్యకి రోలెక్స్ వాచ్‌ని బహుమతిగా అందించిన కమల్ హాసన్.. ఒక తండ్రికి ఆనందం వస్తే.. తమ బిడ్డలను ఎలా దగ్గరకు తీసుకుంటాడో అలా.. దగ్గరకు తీసుకుని లోకేష్, విజయ్ సేతుపతి, అనిరుధ్, చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన స్టాలిన్‌కు ముద్దులిచ్చారు. ప్రస్తుతం కమల్ హాసన్ ముద్దులిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ సేతుపతి, అనిరుధ్ వంటి వారిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. ‘మీకు కమల్ సార్ బహుమతులేమీ ఇవ్వలేదా’ అని ప్రశ్నించగా.. ‘అసలాయన సినిమాలో నటించడమే పెద్ద గిఫ్ట్’ అని విజయ్ సేతుపతి, ‘ఆయన సినిమాకి చేసే అవకాశం రావడమే పెద్ద గిఫ్ట్’ అని అనిరుధ్ సమాధానమిచ్చారు. ఇక లోకేష్ కనగరాజ్ అయితే.. కొన్ని రోజులుగా ఇది కలో.. నిజమో అనేంతగా.. భ్రమలో ఉండిపోయాడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అంత ప్రేమగా అతన్ని కమల్ హాసన్ చూసుకుంటున్నారు.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ‘విక్రమ్’ సినిమాలో చేసిన వారంతా కమల్ హాసన్‌కి వీరాభిమానులు కాబట్టే.. సినిమా ఆ రేంజ్లో వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డులను కూడా తుడిచిపెట్టేస్తుంది అంటే.. ఈ సినిమా కోసం టీమంతా ఎటువంటి ఎఫర్ట్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక కమల్ హాసన్ కూడా కొన్నాళ్లుగా వేచి చూస్తున్న విజయం దక్కడంతో.. ఆనందంగా ‘విక్రమ్’ విజయ యాత్రలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.