✕

x
- శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు
విధాత: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పొటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతున్నది. శుక్రవారం 13 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు సమకూరింది. శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకున్నారు.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం షిండే దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముంబై నుంచి గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుటుంబం.. రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నది.

Somu
Next Story