Tuesday, January 31, 2023
More
    HomeUncategorizedకొత్త లుక్ లో అల్లు అర్జున్ శ్రీమతి.. హీరోయిన్లకు పోటీ..!

    కొత్త లుక్ లో అల్లు అర్జున్ శ్రీమతి.. హీరోయిన్లకు పోటీ..!

    విధాత: ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ స్టార్స్ అయినా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ భార్యలు కేవలం మామూలుగానే ప్రేక్షకులకు పరిచయం. గృహిణులుగా ఉంటూ తమ భర్తల సినిమాలు వాటికి సంబంధించిన వ్యవహారాలు ఇంటి బాధ్యతలతో వారు బిజీ బిజీగా ఉన్నారు. మహేష్ బాబు శ్రీమతి  ఒకప్పటి స్టార్ హీరోయిన్ న‌మ్ర‌తా సైతం మహేష్ బాబు సినిమా వ్యవహారాలు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంది.

    కానీ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి మాత్రం అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అల్లు అర్జున్ ను ఒకప్పుడు స్టైలిష్ స్టార్ అనేవారు. ఈ ట్యాగు ఆయన భార్యకు కూడా బాగా సరిపోతుంది. అల్లు స్నేహ డ్రెస్సింగ్ రేంజ్ ఆ లెవ‌ల్లో ఉంటుంది. అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఫేమస్. ఈమె పోస్ట్ చేసే ఫోటోలకు నెటిజన్లు స్టన్ అయిపోతూ ఉంటారు.

    ఈమే ధరించే దుస్తులు ఎంతో ట్రెండీగా ఉంటాయి. పైగా ఈమె ఫిట్నెస్ కూడా అదే రేంజిలో ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఆమె ఇప్పటికీ ఎంతో గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆమెను ట్రోలింగ్ చేసే వారికి కూడా కొదవలేదు.

    అయినా ఆమె ఆ ట్రోలింగ్ ఏమాత్రం పట్టించుకోదు. గ్లామర్ ఫోటోలతో పాటు యోగా చేసే వీడియోలు ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన బ్యాక్ షేపులు అంటే వీపు అందాలు ప్రదర్శిస్తూ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular