మేష రాశి: సన్నిహితులతో విభేదాలు పరిష్క‌రించుకొందురు. శరీరం స్వస్థత చేకూరుతుంది. ఎవరి సహకారం లేకుండానే పనులు పూర్తవుతాయి. నష్టపోయామ‌నుకున్నా ధనము కొంత లభిస్తుంది. గౌరవమర్యాదలు లభిస్తాయి. వృషభ రాశి: వ్యాపారస్థులకు కొంత వస్తు నష్టము ఉండవచ్చును. పై అధికారుల మూల‌కంగా కొంత భ‌య‌ం వుంటుంది. సోమరితనం వలన కార్య విలంబములుంటాయి. క్రీడాకారులు ఏకాగ్రత చెడకుండా చూసుకోవాలి. వాత సంబంధమైన బాధలుండ‌వ‌చ్చును. మిథున రాశి: వాహన మూలక ఆశాంతి కలుగవచ్చును. ఆలోచనలను అదువులో పెట్టుకోండి. పితృ వ‌ర్గీయుల‌తో విభేదాలు […]

మేష రాశి: సన్నిహితులతో విభేదాలు పరిష్క‌రించుకొందురు. శరీరం స్వస్థత చేకూరుతుంది. ఎవరి సహకారం లేకుండానే పనులు పూర్తవుతాయి. నష్టపోయామ‌నుకున్నా ధనము కొంత లభిస్తుంది. గౌరవమర్యాదలు లభిస్తాయి.

వృషభ రాశి: వ్యాపారస్థులకు కొంత వస్తు నష్టము ఉండవచ్చును. పై అధికారుల మూల‌కంగా కొంత భ‌య‌ం వుంటుంది. సోమరితనం వలన కార్య విలంబములుంటాయి. క్రీడాకారులు ఏకాగ్రత చెడకుండా చూసుకోవాలి. వాత సంబంధమైన బాధలుండ‌వ‌చ్చును.

మిథున రాశి: వాహన మూలక ఆశాంతి కలుగవచ్చును. ఆలోచనలను అదువులో పెట్టుకోండి. పితృ వ‌ర్గీయుల‌తో విభేదాలు కలుగవచ్చును. అనుకొన్న పనులు పూర్తి కాకపోవ‌డం వ‌ల‌న నిస్పృహ క‌లుగుతుంది. శ‌రీర‌ బాధలుండవచ్చును.

కర్కాట‌క రాశి: ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. స‌రైన దిశలో ఆలోచనలు సాగుతాయి. వాక్యాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. కోర్టు వ్య‌వ‌హ‌రాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి: ఆరోగ్య సంబంధమైన విషయాలకు ధనవ్య‌య‌ముంటుంది. వివాదముల మూల‌కంగా న‌ష్ట‌పోతారు. వాహన మూలక‌ భయముంటుంది. చేయవలసిన పనులేవే ముందుకు సాగవు. భోజన సౌఖ్యము ఉండ‌కపోవచ్చును.

కన్యా రాశి: వైద్యరంగంలోని వారికి అనుకూలమైన రోజు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. బహుమానములు లభిస్తాయి. బంధుమిత్రులకు సరైన సలహాలిస్తారు. విఘ్నములు కలిగిననూ కొన్ని పనులు పూర్తి చేస్తారు.

Weekly Horoscope | 19-03-2023 నుంచి 25-03-2023 వార ఫ‌లాలు

తులా రాశి: విదేశీయాన ప్రయత్నములకు అవరోధం కలుగుతుంది. చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. ప్రయాణములలో అల‌స‌ట ఎక్కువగా వుంటుంది. మీరు చేయాల్సిన పనులకు వేరొకరి సాయం కోరవలసి వస్తుంది.

వృశ్చిక రాశి: బంధు మిత్రుల ఇళ్ళను సందర్శిస్తారు. కొన్ని పనులు అనుకొని వ్యక్తులు సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ‌ ప్రయత్నములు ఫలస్తాయి. రావలసిన డబ్బులు మొండిగా వసూలు చేస్తారు. బంగారం కొనుగొలు చేస్తారు.

ధనుస్సు రాశి: అప్రయత్నముగానే ధన లాభములుంటాయి. రాజకీయ నాయకులు కొత్త ప్రణాళికలు వేస్తారు. ప్రయత్నములు ఫలిస్తాయి. శత్రువులతో సంధికి అనుకూలము. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

మ‌క‌ర రాశి: శరీర బాధల వలన ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. అధికారుల మూలకంగా అశాంతి ఉండవచ్చను. వ్యాపారస్థులకు వివాదాలు ఎదురౌతాయి. అనుకోని ఖర్చులు వుంటాయి. మనోవ్యాకులము కలుగవ‌చ్చును.

కుంభ రాశి: సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. అజీర్ణము మూలకంగా శరీరం బాధిస్తుంది. కుటుంబ సభ్యులకు అపవాదులు కలుగుతాయి. సోదరీ వర్గంతో మాటపట్టింపులు వుంటాయి. శ్రమ వృథా అవుతుంది.

మీన రాశి: జీవిత భాగస్వామి వలన మనోధైర్యం లభిస్తుంది. అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవిక కార్యక్రమములలో పాల్గొంటారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ధనాదాయం కలుగుతుంది.

- తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

Updated On 21 March 2023 2:42 AM GMT
Somu

Somu

Next Story