విధాత, సినిమా: హాట్ బ్యూటీ పూర్ణ తన అభిమానులకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది.. వెండితెరపై సెగలు పుట్టించిన పూర్ణ.. బుల్లి తెరపై కూడా జడ్జ్ గా వ్యవహరిస్తూ కుర్రకారు మనసు దోచుకుంటున్నది.. ఆ అందగత్తె ఇప్పుడు ఇల్లాలైంది. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్‌. తెలుగులో ‘శ్రీమహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్‌’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు.. తాజాగా పూర్ణ దీపావళి సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త […]

విధాత, సినిమా: హాట్ బ్యూటీ పూర్ణ తన అభిమానులకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది.. వెండితెరపై సెగలు పుట్టించిన పూర్ణ.. బుల్లి తెరపై కూడా జడ్జ్ గా వ్యవహరిస్తూ కుర్రకారు మనసు దోచుకుంటున్నది.. ఆ అందగత్తె ఇప్పుడు ఇల్లాలైంది.

పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్‌. తెలుగులో ‘శ్రీమహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్‌’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు.. తాజాగా పూర్ణ దీపావళి సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్‌ అసిఫ్‌ ఆలీని వివాహం చేసుకున్నారు.. సోమవారం వీరి వివాహం దుబాయిలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న ఖాసిమ్‌, షనీద్‌ అసిఫ్‌ ఆలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పూర్ణ.. తన భర్తను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు.

‘‘నేను ప్రపంచంలోనే అందమైన స్త్రీని కాకపోవచ్చు. నాలో ఒక మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కానీ, మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు. నా పనిని ప్రోత్సహిస్తున్నారు. నన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు.

ఈరోజు మన కుటుంబ పెద్దలు, బంధువుల మధ్య నేను నీతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’’ అంటూ రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated On 25 Oct 2022 1:32 PM GMT
krs

krs

Next Story