కడియాలకుంట క్వారీలో పేలుడుపై విచారణ సంఘటనా స్థలంను పరిశీలించిన గనులశాఖ అధికారులు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు క్వారీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినది కాదు మంత్రి క్వారీలో పేలుడు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం: మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి విధాత:చిత్తూరుజిల్లా చౌడేపల్లి మండలం కడియాలకుంటలోని క్వారీలో పేలుడు సంభవించి, ఒకరు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు గనులు మరియు భూగర్భశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో […]

కడియాలకుంట క్వారీలో పేలుడుపై విచారణ

  • సంఘటనా స్థలంను పరిశీలించిన గనులశాఖ అధికారులు
  • బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు
  • క్వారీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినది కాదు
  • మంత్రి క్వారీలో పేలుడు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం
    : మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి

విధాత:చిత్తూరుజిల్లా చౌడేపల్లి మండలం కడియాలకుంటలోని క్వారీలో పేలుడు సంభవించి, ఒకరు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు గనులు మరియు భూగర్భశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేలుడు జరిగిన క్వారీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినట్లు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో మంత్రి పేరుతో ఎటువంటి క్వారీలు లేవని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం తగదని అన్నారు. ఈ పేలుడు ఘటనపై చిత్తూరుజిల్లాకు చెందిన మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌లు సంఘటనా స్థలంను సందర్శించారని, దీనిపై విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేలుడు వల్ల మృతి చెందిన వ్యక్తికి నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందచేస్తామని తెలిపారు.

Updated On 30 May 2021 3:08 AM GMT
subbareddy

subbareddy

Next Story