Wednesday, March 29, 2023
More
    HomeUncategorizedGas Prices | గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా BRS నిరసనలు

    Gas Prices | గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా BRS నిరసనలు

    విధాత‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను (Gas Prices) నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar District) తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్‌ (BRS) నాయ‌కులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

    పెద్ద ఎత్తన పాల్గొన్న మహిళలు తరచూ సిలిండర్‌ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ కేంద్ర సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) మాట్లాడుతూ అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు.

    యూపీఏ హయాంలో గ్యాస్‌పై రూ.2.14లక్షల సబ్సిడీ ఇచ్చేదని.. గ్యాస్‌పై సబ్సిడీని బీజేపీ (BJP) పూర్తిగా ఎత్తివేసిందని మండిపడ్డారు. జీరో అకౌంట్లో తెరిపించి 15 లక్షలు వేస్తానన్న మోడీని నిలదీయాలని మహిళలకు పిలుపునిచ్చారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular