విధాత: ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ముఖం చాటేసేది బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులే అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. మా నాయ‌కుడు కేసీఆర్ ఎప్పుడు కూడా ముఖం చాటేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో గులాబీ కండువా విప్ల‌వం సృష్టించ‌బోతుంద‌న్నారు. జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గం రాయిక‌ల్ మండ‌లంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో క‌విత పాల్గొని మాట్లాడారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన జీవ‌న్‌రెడ్డి అభివృద్ధిని ప‌ట్టించుకోలేద‌ని క‌విత ధ్వ‌జ‌మెత్తారు. […]

విధాత: ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ముఖం చాటేసేది బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులే అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. మా నాయ‌కుడు కేసీఆర్ ఎప్పుడు కూడా ముఖం చాటేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో గులాబీ కండువా విప్ల‌వం సృష్టించ‌బోతుంద‌న్నారు. జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గం రాయిక‌ల్ మండ‌లంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో క‌విత పాల్గొని మాట్లాడారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన జీవ‌న్‌రెడ్డి అభివృద్ధిని ప‌ట్టించుకోలేద‌ని క‌విత ధ్వ‌జ‌మెత్తారు. మ‌న సీఎం మోదీ వ‌స్తున్నాడ‌ని ముఖం చాటేశార‌ని జీవ‌న్ రెడ్డి అంటున్నాడు. మ‌రి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేసుకుంటూ తెలంగాణ‌కు వ‌చ్చిండు. ఆయ‌న ఎప్పుడైతే తెలంగాణ‌కు వ‌చ్చిండో.. మునుగోడు ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ నాయ‌కులు ముఖం చాటేశాడు.

మా నాయ‌కుడు ఎప్పుడూ కూడా ముఖం చాటేయ‌లేదు. ముఖం చాటేసేది బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు మాత్ర‌మే. అనుకున్న ల‌క్ష్యం సాధించే వ‌ర‌కు నిల‌బ‌డే నాయ‌కుడే నిజ‌మైన నాయ‌కుడు అని క‌విత స్ప‌ష్టం చేశారు. ఇక రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్తమాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు తప్పా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు.

“ తెలంగాణకు ఏం చేశారని పలుసార్లు ప్రధానిని ముఖ్యమంత్రి ప్రశ్నంచారు. కానీ వాటికి మోడీ ఎక్కడా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలి. ఉత్తి మాటుల చెప్పేవాళ్లేవరూ… అభివృద్ధి చేసే నాయకులేవరు .. ఉట్టి మాటలు చెప్పే పార్టీ ఏది.. ముఖంచాటేసే పార్టి ఏది… అన్నది ప్రజలు గుర్తించేలా కార్యకర్తలు పనిచేయాలని ఆమె కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

Updated On 12 Nov 2022 11:33 AM GMT
krs

krs

Next Story