విధాత‌: పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ జమ్ముకశ్మీర్‌లో ఆయుధాలను జారవిడిచింది. భద్రతా దళాలు శుక్రవారం సాంబా జిల్లాలో వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం రాజ్‌పురా ప్రాంతంలోని బబ్బర్ నుల్లాలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సాంబా జిల్లా పోలీస్‌ చీఫ్ రాజేష్ శర్మ తెలిపారు. పాక్‌ డ్రోన్‌ జారవిడిచిన రెండు పిస్టల్స్, ఐదు మ్యాగజైన్‌లు, 122 రౌండ్ల మందుగుండు సామగ్రి, సైలెన్సర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆయుధాలను స్వాధీనం […]

విధాత‌: పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ జమ్ముకశ్మీర్‌లో ఆయుధాలను జారవిడిచింది. భద్రతా దళాలు శుక్రవారం సాంబా జిల్లాలో వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం రాజ్‌పురా ప్రాంతంలోని బబ్బర్ నుల్లాలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సాంబా జిల్లా పోలీస్‌ చీఫ్ రాజేష్ శర్మ తెలిపారు. పాక్‌ డ్రోన్‌ జారవిడిచిన రెండు పిస్టల్స్, ఐదు మ్యాగజైన్‌లు, 122 రౌండ్ల మందుగుండు సామగ్రి, సైలెన్సర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ప్రాంతం భారత్‌-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నదని అన్నారు.

కాగా, పాక్‌ నుంచి వచ్చిన డ్రోన్‌ను గుర్తించి అది జారవిడిచిన ఆయుధాల ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భారత ఆర్మీ పశ్చిమ కమాండ్‌ శుక్రవారం ట్వీట్‌ చేసింది. మరోవైపు ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా పనిగా ఆర్మీ, నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

Updated On 7 Aug 2021 5:27 AM GMT
subbareddy

subbareddy

Next Story