Modi Mother | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరా బేన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 99 ఏండ్ల వయసున్న మోదీ తల్లి గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను అహ్మదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిన్ననే మోదీ సోదరుడికి తీవ్ర గాయాలు
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు.. మైసూర్ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య, కుమారుడు, మనువడు గాయపడ్డారు. ఈ ప్రమాదంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను మైసూర్ ఎస్జే ఆస్పత్రికి తరలించారు.