విధాత‌(చెన్నై): త‌మిళ‌నాడులో డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు చెన్నైలోని త‌మిళ‌నాడు సెక్రెటేరియ‌ట్‌కు వెళ్లిన ఆయన సీఎం కుర్చీలో ఆసీనులై బాధ్య‌త‌ల స్వీకార ప‌త్రంపై సంత‌కం చేశారు. అంత‌కుముందు ఆయ‌న రాజ్‌భ‌వ‌న్‌లో త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు. గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్ ఆయ‌న చేత ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం ఆయ‌న త‌న తండ్రి క‌రుణానిధి స్మృతి వ‌నం ద‌గ్గ‌రికి వెళ్లి నివాళుల‌ర్పించారు. అక్క‌డి నుంచి నేరుగా సెక్రెటేరియ‌ట్‌కు వ‌చ్చి […]

విధాత‌(చెన్నై): త‌మిళ‌నాడులో డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు చెన్నైలోని త‌మిళ‌నాడు సెక్రెటేరియ‌ట్‌కు వెళ్లిన ఆయన సీఎం కుర్చీలో ఆసీనులై బాధ్య‌త‌ల స్వీకార ప‌త్రంపై సంత‌కం చేశారు. అంత‌కుముందు ఆయ‌న రాజ్‌భ‌వ‌న్‌లో త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు. గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్ ఆయ‌న చేత ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం ఆయ‌న త‌న తండ్రి క‌రుణానిధి స్మృతి వ‌నం ద‌గ్గ‌రికి వెళ్లి నివాళుల‌ర్పించారు. అక్క‌డి నుంచి నేరుగా సెక్రెటేరియ‌ట్‌కు వ‌చ్చి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌రోనా సాయం ఫైలుపై తొలి సంత‌కం చేశారు. దాంతో క‌రోనా సాయం కింద తెల్ల‌ రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబానికి రూ.4000 చొప్పున ఆర్థిక సాయం అంద‌నుంది. ఈ ఆర్థిక సాయాన్ని మే, జూన్ నెల‌ల్లో రెండు విడుత‌లుగా రెండేసి వేల చొప్పున అందించ‌నున్నారు. మొద‌టి విడుత రూ.2000 చొప్పున ఈ నెల‌లోనే ఇవ్వ‌నున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం జారీచేసిన బీమా కార్డులు క‌లిగి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా చికిత్సల‌కు అయ్యే ఖ‌ర్చు మొత్తం రాష్ట్ర ప్ర‌భుత్వమే భ‌రిస్తుంద‌ని స్టాలిన్ ప్ర‌క‌టించారు.

అంతేగాక‌, సిటీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ఫైలుపై కూడా స్టాలిన్ సంత‌కం చేశారు. పాల ధ‌ర‌ల‌ను కూడా ఆయ‌న త‌గ్గించారు. ప్ర‌తి లీట‌ర్ పాల‌పై రూ.3 చొప్పున త‌గ్గించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Updated On 7 May 2021 11:05 AM GMT
subbareddy

subbareddy

Next Story