ఉన్నమాట: బూర నర్సయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత అధికార పార్టీ నుంచి ఇంకా ఎవరు పార్టీ వీడుతారనే చర్చ జరిగింది. ఆ సమయంలో చాలా మంది నేతల పేర్లు తెర మీదికి వచ్చాయి. అందులో కర్నె ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లతో మొదలైన ప్రచారం హరీశ్ రావు, ఎంపీ రంజిత్.. బీజేపీలోకి వెళ్తారంటూ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఇంకా తమతో 20 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టచ్‌లో […]

ఉన్నమాట: బూర నర్సయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత అధికార పార్టీ నుంచి ఇంకా ఎవరు పార్టీ వీడుతారనే చర్చ జరిగింది. ఆ సమయంలో చాలా మంది నేతల పేర్లు తెర మీదికి వచ్చాయి. అందులో కర్నె ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లతో మొదలైన ప్రచారం హరీశ్ రావు, ఎంపీ రంజిత్.. బీజేపీలోకి వెళ్తారంటూ వాట్సప్ యూనివర్సిటీ ద్వారా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఇంకా తమతో 20 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నట్టు బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతూ వస్తున్నారు.
అయితే టీఆర్‌ఎస్ నుంచి నర్సయ్య తప్పా ఎవరూ పెద్ద నేతలు వెళ్ళ లేదు. కానీ బీజేపీ నుంచి టీఆర్‌ఎస్ లోకి బూడిద భిక్షమయ్యతో మొదలైన వలసలు స్వామి గౌడ్, దాసోజు శ్రావణ్ దాకా వచ్చాయి. వీళ్లు పార్టీ మారి కారెక్కనున్నారు అని ప్రచారం జరిగిన గంటల వ్యవధిలోనే టీఆర్ఎస్‌లో చేరారు.
ఇది ఇక్కడితో ఆగలేదు. ఇంకా టీఆర్‌ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిల పేర్లు పొద్దున నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని రఘునందన్, రవీందర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు ఖండించారు.
ఇది ఇలా ఉండగా తాజాగా కూన శ్రీశైలం గౌడ్, వీరేందర్ గౌడ్‌లు కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే నిన్న అధికారికంగా చేరింది ఇద్దరు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వారి సంఖ్య మెల్లమెల్లగా డబుల్ డిజిట్‌కు చేరింది.
ఇంతకీ ఇందులో వాస్తవం, ఆవాస్తవం ఏమిటన్నది తెలియాలంటే పార్టీని వీడుతారని పేర్లు బైటికి వినిపిస్తున్న వారు తక్షణమే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు
రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అంటున్న బీజేపీకి మరో షాక్ తగలుతున్నాయి. నిజమైన ఉద్యమకారులకు బీజేపీనే వేదిక అవుతున్నదన్న ఆ పార్టీ నేతల ప్రచారం అసత్యమని తేలనున్నదా? అంటే నిజమే అంటున్నారు. బీజేపీలో చేరక ముందు టీఆర్ఎస్‌లో గానీ, కాంగ్రెస్ పార్టీలో గానీ గౌరవ ప్రదంగా ఉండే నేతలు, నిత్యం రాజకీయ డిబేట్లలో కనిపించే వారు.
కాషాయ తీర్థం పుచ్చుకున్నాక ఎక్కడా కనిపించకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయన్నది ఆ పార్టీని వీడుతున్న నేతల వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నది. ఉద్యమకారులను ఉద్యమపార్టీని విమర్శించడానికే తప్పా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం కుదరదన్నది ఆ పార్టీలో చేరి తిరిగి అసంతృప్తితో సొంత గూటికి చేరుతున్న నేతల మాటలు దానికి అద్దం పడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోస్ శ్రవణ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేర్చుకోవడానికి ఆయనకు ఏమ హామీ ఇచ్చారో తెలియదు. కానీ ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. టీఆర్ఎస్‌లో ఉన్నన్ని రోజులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు దాసోజు శ్రవణ్ నిత్యం టీవీ చర్చల్లో కనిపించేవారు.
చాలా మంచి వక్త అయిన ఆయన కాషాయ పార్టీలోకి వెళ్లగానే సైలెంట్ అయ్యారు. గతంలో బీజేపీలో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చడం లేదని సమాచారం. నేతలు చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అన్నది నిన్న బూడిద భిక్షమయ్య చెప్పారు. దీంతో దాసోజు శ్రావణ్ బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు.
అలాగే స్వామిగౌడ్ కూడా మండలి ఛైర్మన్ చేసిన ఘనత టీఆర్ఎస్‌ది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన పార్టీ వీడారు. అప్పటి నుంచి ఆయన అడపాదడపా కనిపిస్తున్నా ఆయన సేవలను పార్టీ పూర్తిగా ఉపయోగించుకుంటున్నట్లు గాని ఆయనకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో ఆయనతో కూడా టీఆర్ఎస్‌లో చేరారు. ఇవన్నీ చూస్తే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి పక్కన పెడితే అసలు ఆ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో తెలియని అమోయమం నెలకొనే పరిస్థితులు వచ్చాయి.
