ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు జనగాం జిల్లా గిర్ని తండాలో ప్రీతి కుటుంబ సభ్యులకు సంజ‌య్ పరామర్శ Why not inquire with the sitting judge? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్… మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్థి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారు? అంటూ బీజేపీ […]

  • ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు
  • జనగాం జిల్లా గిర్ని తండాలో ప్రీతి కుటుంబ సభ్యులకు సంజ‌య్ పరామర్శ

Why not inquire with the sitting judge?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్… మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్థి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారు? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.

ప్రీతి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సంజ‌య్‌..

జనగాం జిల్లాలోని గిర్ని తండాలో ప్రీతి కుటుంబాన్ని బండి సంజయ్ ఆదివారం పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే… ప్రీతి ఎంజీఎంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూపారు. సైఫ్ అనే వ్యక్తి ర్యాగింగ్ చేసినట్లుగా చెప్పి, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా స్పందించకుండా కాలేజీ హెచ్ఓడీ ప్రీతినే బెదిరించడం వంటివన్నీ చూశామన్నారు.

ప్రీతి ఘ‌ట‌న‌పై ఎందుకు స్పందించ‌రు…

ప్రీతిది హత్యే… ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చనిపోయిన డెడ్‌బాడీని నిమ్స్‌కు తీసుకెళ్లి దొంగ ట్రీట్‌మెంట్ చేశారని విమర్శించారు. కేటీఆర్ కండకావరం ఎక్కింది. బలుపెక్కి మాట్లాడుతున్నడు. ప్రీతి ఘటనపై ఎందుకు స్పందించలేదు? ప్రతి దానికి ట్వీట్ చేస్తావ్ కదా… హోంమంత్రి అసలున్నాడా? పాతబస్తీకే పరిమితమైండని విమర్శించారు.

ప్రీతికి అండగా ఉంటాం..

ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని సంజయ్ భరోసా ఇచ్చారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తాం. కేసీఆర్‌కు ఎస్టీలంటనే చులకన, విద్యార్థులు, అమ్మాయిలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. పోడు భూముల సమస్య పరిష్కరించడు. గిరిజన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంజయ్‌తోపాటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దశమంత్‌రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్ తదితరులు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రీతి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated On 5 March 2023 11:47 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story