HomeLatest newsఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీణ-వాణీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

వీణ-వాణీల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తామని, వారి కలలను సాకారం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వీణ-వాణిలకు సహకారం అందించిన అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అయితే వీరిద్ద‌రూ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు స్వ‌యంగా రాశారు. ఇక ప‌దో త‌ర‌గ‌తిలోనూ వీణ‌, వాణి ఫ‌స్ట్ క్లాసులో పాస‌య్యారు. వీణ 9.3 జీపీఏ, వాణి 9.2 జీపీఏ సాధించారు.

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ గారు వెంగళరావు నగర్ డివిజన్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవిభక్త కవలలు వీణ వాణి ఇంటర్మీడియట్ ద్వితీయ సవంత్సరం పరీక్షలో మంచి మార్కులతో ఉతీర్ణులవడంతో ఎమ్మెల్యే గోపినాథ్ శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో స్తానిక డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు, విజయ్ ముదిరాజ్, జి టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, సత్యనారయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!