రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో ఒక కూతురు, ఒక కొడుకుతో కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మహిళ.
భర్త చనిపోయి కుటుంబ పోషణ భారంగా మారడంతో, ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కూతురికి వివాహం చేద్దామని నిర్ణయించుకున్న తల్లి
భర్త చనిపోయి కుటుంబ పోషణ భారంగా మారడంతో, ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కూతురికి వివాహం చేద్దామని నిర్ణయించుకున్న తల్లి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కాందవాడ గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి బాగా ఉందని సంబంధం కుదిర్చిన మధ్యవర్తి.
ఈ సంవత్సరం మే 28వ తేదీన వారిద్దరికీ వివాహం జరిపించగా, ఇష్టం లేని పెళ్లి చేశారని, చదువుకుంటానని ప్రధానోపాధ్యాయుడు వద్ద తన బాధ చెప్పుకున్న బాలిక.
బాలిక ఫిర్యాదు మేరకు తల్లి, 40 ఏళ్ల వ్యక్తి, మధ్యవర్తి, పెళ్లి జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికను రెస్క్యూ హోంకు తరలించిన పోలీసులు.