క్యారెక్టర్ ఆర్టిస్టే అయినా సురేఖ వాణి స్టార్ హీరోలతో తెరపంచుకున్న ఈ నటి.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. తల్లి, వదిన, అక్క, అత్త పాత్రలతో అట్రాక్ట్ చేసింది.
వెండితెరపై సూపర్ గ్లామర్ గా కనిపించే ఆమె, సోషల్ మీడియాలో కూడా క్రేజీ లుక్స్ పోస్ట్ చేస్తూ పాపులర్ అయింది.
ఇదంతా ఒకెత్తయితే సురేఖ వాణి లైఫ్ సీక్రెట్స్ చాలామందికి తెలియదు. ఆమె ప్రేమ కథ, పెళ్లి, పిల్లలు, భర్త చనిపోవడం.
ఇలా వరుస సంఘటనలు ఆమె జీవితంలో ఎన్నో ట్విస్టులతో కూడి ఉన్నాయి. సురేఖ వాణి భర్త కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి అనేది చాలా మందికి తెలియని విషయం.
విజయవాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది సురేఖావాణి. చదువు పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో ఇండస్ట్రీకి వచ్చింది.
మా టీవీ ఛానల్ లో కొంతకాలం పాటు పని చేసింది. అయితే అదే మా టీవీలో సీరియల్ స్క్రిప్టు రైటర్ గా, దర్శకుడిగా పనిచేస్తున్న సురేష్ తేజని ప్రేమించింది.
ఆపై ఇద్దరూ ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఆ వెంటనే 2005లో ప్రముఖ సీనియర్ దర్శకుడు పూసల రాధాకృష్ణ దర్శకత్వం వహించిన
శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే ఈ చిత్రంలో నటించి నటిగా సినీ కెరీర్ ప్రారంభించిన సురేఖావాణి.. పలు సినిమాల్లో నటించింది.
పెళ్లయిన తర్వాత భర్తతో చాలా అన్యోన్యంగా ఉండే సురేఖావాణి, అటు సినీ కెరీర్ కూడా కంటిన్యూ చేసింది. వీరికి సుప్రీత అనే ఒక పాప కూడా ఉంది.
అయితే పెళ్లయిన కొన్నేళ్ల భర్త సురేష్ తేజ అనారోగ్యం పాలయ్యాడు. చివరికి 2019లో సురేష్ తేజ కన్ను మూయడం సురేఖావాణి జీవితానికి తీరని లోటు.
అప్పటినుంచి బిడ్డతో కలిసి ఉంటూ సుప్రీత కెరీర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టింది సురేఖావాణి.
ప్రస్తుతం ఇద్దరికీ పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు.