కృతయుగం నాటి ఆదివ్య సన్నిధిలో అందించే పెన్ను తీసుకుని ఎలాంటి కార్యక్రమము నిర్వహించిన 100% ఆ సన్నిధి విజయం అందిస్తుందని దేవతలు చెప్పిన మాటగా చెప్పబడుతుంది.
నాటినుంచి ఆ పెన్నులు తీసుకునేందుకు సంఖ్య సైతం పెరగడంతో లక్ష పెన్నలతో స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు, అనంతరం ఆ పనులను విద్యార్థులకు అందించడం ఆనవాయితీగా వస్తుంది.
స్వామివారి సన్నిధిలో పూజ నిర్వహించి తీసుకున్న పెనుతో ఎలాంటి పనులు ప్రారంభించిన శుభదాయకంగా విజయవంతం అవుతాయని ఇప్పటివరకు నెలవేరిన లక్షలాది మంది భక్తులు చెబుతున్నారు.
ముఖ్యంగా విద్యార్థులు ఈ పెన్నతో పరీక్షలు రాసినట్లయితే 100% ఉత్తీర్ణత అవుతారని ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
అయితే ఈ అద్భుతమైన ఆలయ పెన్నెల చరిత్ర చూద్దాం.. రాజమండ్రి సమీపన్న గల ఉన్న అయినవిల్లి విగ్నేశ్వరస్వామి ఆలయానికి విశేష బరితమైన చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు
కృతయుగంలో గణపతిస్వామి వెలిసి కలియుగంలో నేనక్కడుంటానని స్వప్నంలో చెప్పి, భక్తులను కలిప్రభావం నుంచి కాపాడుతున్న స్వామి అయినవిల్లి గణపతి స్వామిగా చరిత్ర చెబుతుంది.
గోదావరి అందచందాల నడుమ విరాజిల్లుతున్న దివ్య క్షేత్రంలో ఏడాదంతా ఉత్సవాలు పూజలు నిర్వహించిన జనవరి ఆఖరిలో మాత్రం స్వామికి లక్ష పెనులతో విశేష భరితమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.
దీని వెనక ఎంతో అద్భుతమైన చరిత్ర కూడా ఉందని చెప్పుకోవచ్చు. స్వామి దివ్య సన్నిధిలో పూజలు జరిగిన ఈ పెన్నను అందుకోవాలంటే పెట్టి పుట్టాలని ఎంతోమంది భక్తులు చెబుతూ ఉంటారు.
అటువంటి అయినవిల్లి గణపతిస్వామి దివ్యసన్నిధిలో లక్ష పెన్నుల పూజా మహోత్సవం కనివిని ఎరుగని రీతిలో జరిగింది, అయితే ఆపెన్నలు అందించేందుకు సైతం దేవస్థానం కంకణం కట్టుకుంది.